Friday, April 26, 2024
- Advertisement -

జ‌గ‌న్‌ను ఎదుర్కొనే ద‌మ్ములేక బ్లాక్ మేయిల్ రాజ‌కీయాల‌కు పాల్ప‌డుతున్న టీడీపీ…?

- Advertisement -

2019 ఎన్నిక‌ల్లో జ‌గ‌న్‌ను ఎదుర్కొనేదానికి నానా తంటాలు ప‌డుతున్నారు. పోయిన ఎన్నిక‌ల్లో మాదిరే జ‌గ‌న్ అత్యంత అవినీతిప‌రుడ‌ని, ల‌క్ష కోట్లు దోచుకున్నాడ‌నే ఆరోప‌ణ‌ల‌కు టిడిపి మ‌ళ్ళీ ప‌దును పెడుతోంది. ఆ ఎన్నిక‌ల్లో జ‌గ‌న్‌పై దుస్ప్ర‌చారం చేసి అధికారంలోకి వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు బాబు కూడా అదే దుస్ప్రచారాన్ని ఎంచుకున్నారు.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ పై చేయ‌టానికి చంద్ర‌బాబు అండ్ కో కు కొత్త ఆరోప‌ణ‌లేవీ ఉన్న‌ట్లు లేవు. చేయాల్సిన ఆరోప‌ణ‌ల‌న్నింటినీ పోయిన ఎన్నిక‌ల్లోనే చేసేశాయి. ఇక కొత్త‌గా చేసె ఆరోప‌న‌లు లేవు కాబ‌ట్టి ప్ర‌ణాలికా సంఘం ఉపాధ్య‌క్షుడు కుంటుంబ‌రావును రంగంలోకి దింపారు.

అమ‌రావ‌తి బాండ్ల విష‌యంలో బాబుపై జ‌గ‌న్ చేస్తున్న ఆరోప‌న‌ల‌కు స‌మాధానం చెప్ప‌లేక కుటుంబ‌రావును రంగంలోకి దించింది. ఆయ‌న ప్ర‌భుత్వ అధికారిగా కాకుండా పొలిటీషియ‌న్‌లాగా జ‌గ‌న్‌ను బ్లాక్ మేల్ చేస్తున్నారు. కుటుంబ‌రావు రాష్ట్ర ఆర్ధిక వ్య‌వ‌హారాల గురించి మాత్ర‌మే మాట్లాడాలి, ఎందుకంటే, ఆయ‌న రాజ‌కీయ‌నేత కాదు. అయ‌న తెలుగు దేశం నేత కాదు. అటువంటిది ఆయ‌న త‌న ప‌రిధిని దాటి రాజ‌కీయ విమ‌ర్శ‌లు, ఆరోప‌న‌లు చేయ‌డం విచిత్రంగా ఉంది.

జ‌గ‌న్ అవినీతిని బ‌య‌ట‌పెడ‌తానంటూ బెదిరింపు ధోర‌ణిలో మాట్లాడుతున్నారు. జ‌గ‌న్, ఆయ‌న కంపెనీల‌కు సంబంధించిన బండారాన్ని త్వ‌ర‌లో బ‌య‌ట‌పెడ‌తానంటున్నారు. కుటుంబ‌రావు ఇపుడు కొత్త‌గా జ‌గ‌న్ , కంపెనీల బండారాన్ని బ‌య‌ట‌పెట్ట‌ట‌మేంటో ఎవ‌రికీ అర్దం కావ‌టం లేదు. జ‌గ‌న్ పైన‌, ఆయ‌న కుటుంబాల‌పైన ఇడి, సిబిఐ త‌దిత‌ర ద‌ర్యాప్తు సంస్ధ‌లు ద‌ర్యాప్తు చేస్తూనే ఉన్నాయి. కొత్త‌గా ఈయ‌న బ‌య‌ట పెట్టేదేముంది. ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డుతున్న నేప‌థ్యంలో జ‌గన్‌ను ఎదుర్కొలేక బాబు నాట‌కాలు ఆడుతున్నార‌ని విశ్లేష‌కులు అంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -