జగన్ 6 నెలల పాలనపై స్పెషల్ స్టోరీ..!

2439
Latest Survey on AP CM YS Jagan 6 months Rule
Latest Survey on AP CM YS Jagan 6 months Rule

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టి 6 నెలలు అవుతోంది. అయితే ఎన్నికల సమయంలో దాదాపు వైసీపీనే గెలుస్తోంది ప్రజలు అందరు గట్టిగానే నమ్మరు. అనుకున్నట్లుగానే వైసీపీ ప్రభుత్వం ఏర్పడింది. దాంతో ఈ ప్రభుత్వంపై భారీ అంచనాలు కూడా ఏర్పడ్డాయి. నవరత్నాల హామీతో.. ఎన్నికల్లో ఊహించని విజయం సొంతం చేసుకున్న జగన్.. ఆరునెలల్లోనే ఉత్తమ సీఎం అనిపించుకుంటానని మాట కూడా ఇచ్చారు.

అయితే గతంలో పెద్దగా పాలన అనుభవం లేని జగన్.. ఆర్ధిక లోటుతో కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తారు ? ఈ ఆరు నెలల్లో ఆయన బెస్ట్ ముఖ్యమంత్రి అనిపించుకుంటారా ? ఇలాంటివి ప్రశ్నలు ప్రజల్లో ఉన్నాయి. అయితే ఈ ఆరు నెలల పాలన చూస్తే.. గ్రామ వాలంటీర్లు, గ్రామ సచివాలయాలు కలిపి నాలుగు లక్షలకు పైగానే ఉద్యోగాలు ఇచ్చారు జగన్. బెల్ట్ షాపులను రద్దు చేశారు.

ఆటో డ్రైవర్లకు, మత్స్యకారులకు ఆర్ధిక సాయం చేశారు. పేద పిల్లలు ఉన్నత చదువులు చదువుకోవాలని ఇంగ్లిష్ మీడియం విద్యను తీసుకొచ్చారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే చేశారు. అయితే ఈ ఆరు నెలల జగన్ పాలనపై ఓ జాతీయ పార్టీ చేయించిన సర్వేలో జగన్ గ్రాఫ్ పెరిగినట్లు తెలుస్తోంది. జగన్ పాలన గురించి దాదాపుగా ఓ వెయ్యి మంది అడిగి ఓ సర్వే చేశారు. జగన్ పాలన పట్ల ప్రజలు సంతోషంగా ఉన్నారు. మరి ముఖ్యంగా అయితే మహిళలు అతని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నారు.

ఇక మద్యం విషయంలో త్రాగుబోతులు ఇబ్బందులు పడుతున్నారు. ఇక పవన్ కళ్యాణ్ ఎన్ని సభలు పెట్టిన.. బాబు ఎన్ని దీక్షలు చేసిన అవన్నీ ప్రజలు అసలు పట్టించుకోవడం లేదు. ఇక జగన్ డబ్బులు ఎక్కడ నుంచి తీసుకొస్తున్నాడనే అనుమానాలను కొందరు వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైన జగన్ పాలనలో సుఖ సంతోషలతో ఉన్నామని 70 శాతం ఏపీ ప్రజలు చెబుతున్నారు. ఇక పర్వాలేదని 6 శాతం చెప్పగా.. బాగాలేదు 24 శాతం మంది చెప్పారు. ఈ లెక్కన చూస్తే వచ్చేసారి కూడా జగనే సీఎం అవుతారు అనడంలో ఎలాంటి సందేహం లేదు.

Loading...