Thursday, April 25, 2024
- Advertisement -

లాక్ డౌన్ అని తెలిసి బయటకు వచ్చినవారిని పోలీసులు ఏం చేశారంటే ?

- Advertisement -

కరోనా వైరస్‌ వ్యాప్తిని చెందకుండా ఆరికట్టేందుకు ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయం మర్చిపోయారో లేక మనల్ని ఎవరు ఏం అంటారు అనుకున్నారో కానీ చాలా మంది రోడ్లపైకి వచ్చారు. దీంతో హైదరబాద్ తో పాటు పలు ప్రాంతాల్లో ఉదయం నుంచి ఆటోలు, ప్రైవేటు వాహనాలు తిరిగాయి. టీఆఎస్ఆర్టీసీ బంద్ కావడంతో ప్రైవేటు వాహనాలు ధరలు పెంచి నడిపిస్తున్నారు.

ప్రభుత్వం చేస్తోన్న హెచ్చరికలను చాలా మంది వాహనదారులు అసలు పట్టించుకోవడం లేదు. నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలం కొర్లపాడు టోల్ గేట్ వద్ద భారీగా ట్రాఫిక్ జాం కావడం గమనార్హం. దీంతో టోల్ గేట్లను మూసేశారు. ఇళ్లలోంచి బయటకు వచ్చిన వారికి కొన్ని ప్రాంతాల్లో పోలీసులు కౌన్సిలింగ్‌ ఇచ్చి వెనక్కి పంపుతున్నారు. రంగారెడ్డి జిల్లాలోని కొత్తూరులో వాహనాలపై యథేచ్ఛగా తిరుగుతోన్న వారిని పోలీసులు అరెస్టు చేశారు.

అలానే పలు చోట్ల బయట అనోసరంగా కనిపిస్తే వారిని హెచ్చరించి ఇంటికి పంపిస్తున్నారు. వాహనాలపై తిరిగుతున్న వారిని సాయంత్రం వరకు స్టేషన్‌లోనే ఉంచుతామని తెలిపారు. వారి వాహనాలు సీజ్‌ చేసి పోలీస్‌స్టేషన్‌లకు తరలించామని చెప్పారు. మెడికల్‌, నిత్యావసర వస్తువులు తీసుకునేందుకు మాత్రమే ఇంటికి ఒక్కరు బయటకు రావాలని అన్నారు. ఇక ఇతర దేశాల్లో కూడా బయట కనిపిస్తే జైలు కి పంపిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -