Tuesday, March 19, 2024
- Advertisement -

ఢిల్లీలో మారిన రాజ‌కీయం..జ‌గ‌న్‌తో మంత‌నాలు జ‌రుపుతున్న ఎన్‌సీపీ అధినేత శ‌ర‌ద్ ప‌వార్‌

- Advertisement -

పోలింగ్ ముగిసిన‌ప్ప‌టినుంచి కేంద్ర రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పాల‌నుకున్న బాబు ఆశ‌లు ఒక్కొక్క‌టిగా ఆవిరి అవుతున్నాయి. కేంద్రంలో హంగ్ వ‌స్తే ఎన్డీఏకు వ్య‌తిరేకంగా యూపీఏతో క‌లసి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయాల‌ని అన్నీ తానై ఢిల్లీలో రాజకీయం చేస్తున్న బాబుకు ఎగ్జిట్ పోల్స్ షాక్ ఇచ్చాయి. రెండు రోజుల్లో ఫ‌లితాలు వెలువ‌డ‌నున్న నేప‌ధ్యంలో అన్ని ఎగ్జిట్ పోల్స్ అన్ని మ‌రో సారి బీజేపీకే ప్రజలు ప‌ట్టం క‌ట్టారాని ప్ర‌క‌టించ‌డంతో బాబులో నిరాశ మొద‌ల‌య్యింది.

సొంత రాష్ట్రం ఏపీలో అధికారంలోకి రాని నేత ఢిల్లీ రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్ప‌డం అంటె మామూలు విష‌యం కాదు. బాబును ప‌క్క‌న పెట్టి కాంగ్రెస్ పెద్దన్నగా వ్యవహరిస్తూ పార్టీలన్నింటిని కలుపుకొని కూటమిగా ఏర్పడాలని పావులు కదుపుతున్నట్లు సమాచారం. ఇప్పటికే ప్రాంతీయ పార్టీలతో మధ్యప్రదేశ్ సీఎం కమల్‌నాథ్ సహా పలువురు ప్రముఖులు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది.

ఏపీలో వైసీపీ పూర్తి మెజారిటీతో అధికారంలోకి వ‌స్తుంద‌ని స‌ర్వేలు తేల్చ‌డంతో ఇక బాబుతో లాభం లేద‌నుకొని వైఎస్‌ఆర్‌సీపీని బీజేపీయేతర కూటమిలో చేర్చుకోవాలని ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు సమాచారం. దాని కోసం ఎన్సీపీ అధినేత శరద్ పవార్ జగన్‌తో మాట్లాడుతున్నట్లు తెలుస్తోంది.

ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో బీజేపీయేతర పార్టీలన్నీ త్వరలోనే భేటీ అవుతాయని ఇప్పటికే శరద్ పవార్ చెప్పారు. సమావేశంలో విపక్ష నేతలంతా కేంద్రంలో సుస్థిర ప్రభుత్వ ఏర్పాటుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నట్లు ప్రకటించారు. ప‌రిణామాల‌న్నింటిని చూస్తె జ‌గ‌న్‌ను కూడా కూట‌మిలో చేర్చుకోవాల‌ని శ‌ర‌ద్ ప‌వార్ తీవ్ర ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఇన్నాళ్లు కాల్లు అరిగేలా ఢిల్లీకి చ‌క్క‌ర్లు కొట్టిన బాబుకు కూట‌మి నేత‌లు షాక్ ఇస్తున్నారు. ఏదైనా చిత్త‌శుద్ధితో చేస్తె స్వాగ‌తిస్తారు కాని బాబు మాత్రం త‌న స్వార్థ రాజ‌కీయం కోసం చేస్తున్న ప్ర‌య‌త్నాలకు ఎవ‌రూ విలువ‌నివ్వ‌రు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -