జగన్ గురించి అడిగి తెలుసుకున్న మహేష్ బాబు

1366
Mahesh Babu admired about Jagan Mohan Reddy
Mahesh Babu admired about Jagan Mohan Reddy Mahesh Babu admired about Jagan Mohan Reddy

సినిమాలు తప్పిస్తే రాజకీయాల గురించి ఎక్కువగా సూపర్ స్టార్ మహేష్ బాబు పట్టించుకోరు. ఇక జగన్ కూడా రాజకీయాలు తప్పా వేరే ఆలోచన ఆయన మదిలో ఉండదు. రాజకీయాల గురించి తన కొడుకు గౌతమ్ కి తెలిసినంత కూడా తనకు తెలియదని ఓ ఇంటర్వ్యూలో మహేష్ చెప్పాడు.. అలాంటి మహేష్ మొన్న జరిగిన ఎన్నికల వేళ వైఎస్ జగన్ గురించి అడిగి.. ఆరా తీశాడు.

ఈ విషయంను పోసాని కృష్ణ మురళి ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నాడు. ఇప్పుడు ఇది వైరల్ అయింది. ఏపీ సీఎం జగన్ పాలనకు ఏడాది పూర్తయ్యింది. జగన్ పాలనను పోసాని కొనియాడారు. తాజాగా ఓ టీవీ ఇంటర్వ్యూలో జగన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యాలు చేశారు పోసాని. చంద్రబాబును ఓడించి జగన్ గెలుస్తారని ఇండస్ట్రీలో ఎవరు నమ్మలేదని.. బెట్లు కూడా కాశారని చెప్పాడు. ఓ సందర్భంలో వైఎస్ జగన్ గురించి.. ఆయన గెలుపు అవకాశాల గురించి మహేష్ బాబు స్వయంగా తనని అడిగారని పోసాని చెప్పాడు.

ఎటువంటి సంకోచం లేకుండా జగన్ గెలుస్తాడని తాను మహేష్ కు చెప్పినట్టు పోసాని వివరించాడు. అయితే చంద్రబాబు పసుపు కుంకుమ సహా వివిధ పథకాల ద్వారా చంద్రబాబు రూ.10వేలు 12వేలు అంటూ డబ్బులు పంచుతున్నాడు కదా జగన్ గెలుస్తాడా అని మహేష్ అడిగాడని పోసాని తెలిపారు. ‘బాబు.. ప్రజలు తెలివైన వారని.. జగన్ నే గెలిపిస్తారని’ తాను మహేష్ కు చెప్పినట్టు పోసాని వివరించాడు. ఇలా జగన్ గెలుపు గురించి మహేష్ కూడా ఆరాతీశాడని తెలియడంతో ఇది వైరల్ అయింది.

Loading...