పవన్ కళ్యాణ్ కు నాగబాబు తలనొప్పిగా మారాడా ?

855
Mega fans worrying on nagababu incidents
Mega fans worrying on nagababu incidents

మెగా బ్రదర్ నాగబాబు ఈ మధ్య కాలంలో వివాదాదస్పద ట్వీట్లతో తరచుగా విమర్శలు పాలు అవుతున్న విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్, చిరంజీవిలపై ఎవరైన కామెంట్ చేస్తే నాగబాబు వెంటనే రియాక్ట్ అవుతారు. అయితే ఇప్పుడు నాగబాబే వారిద్దరికీ పెద్ద సమస్యగా మారుతున్నాడట. గత ఎన్నికలలో జనసేన తరపున ఎంపీగా పోటీ చేసి ఓడిన నాగబాబు ఈ మధ్య అన్ని విషయాలలో తల దూరుస్తూ అటు పవన్ – చిరులకు ఇటు జనసేన పార్టీకి తలనొప్పిగా మారుతున్నాడని కొందరు ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.

ఈ మధ్య గాంధీని చంపిన గాడ్సే గొప్ప దేశభక్తుడని కామెంట్ చేయడంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఇరుకున పెట్టాడు. నాగబాబు కామెంట్స్ పై ఏకంగా పవన్ కళ్యాణ్ స్పందిస్తూ.. నాగబాబు కామెంట్స్ తో జనసేనకు సంబంధం లేదని.. ఆ వ్యాఖ్యలు అతని వ్యక్తిగతం అని క్లారిటీ ఇచ్చాడు. దీని బట్టి నాగబాబు పవన్ కు ఎలా ఇబ్బందులు తెస్తున్నాడో అర్దం అవుతుంది. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ రాజకీయంగా ఫెయిల్ అవడానికి ముఖ్య కారణం కూడా నాగబాబే అని నెటిజన్స్ అభిప్రాయ పడుతున్నారు.

2014 ఎన్నికలలో జనసేన పార్టీ.. టీడీపీ బీజీపీలకు సపోర్ట్ చేయడంలో నాగబాబు కీ రోల్ ప్లే చేసాడని అప్పట్లో కామెంట్స్ వినిపించాయి. నాలుగేళ్లు టీడీపీ ప్రభుత్వంతో కాపురం చేసి.. చివరి ఏడాదిలో యూ టర్న్ తీసుకొని నాగబాబుతో ఎమోషనల్ గా మాట్లాడించారని అప్పటి ప్రతిపక్షం ఆయనపై కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. కాగా నిన్న బాలయ్య వ్యాఖ్యలపై స్పందించిన నాగబాబు ‘గత టీడీపీ ప్రభుత్వ హయాంలో రియల్ ఎస్టేట్ వ్యాపారంతో సామాన్యుల జీవితాలు సర్వనాశనం అయిపోయాయి.. ఇన్ సైడ్ ట్రేడింగ్ తో అమరావతి ప్రాంతాన్ని మీ తెలుగుదేశం పార్టీ సర్వనాశనం చేసిందని’ విమర్శలు చేసారు.

దీనిపై నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ‘అప్పట్లో టీడీపీ ప్రభుత్వంతో మీ జనసేన పార్టీ కూడా కలిసి ఉంది కదా.. అమరావతి రైతుల దగ్గర 33 వేల ఎకరాలు తీసుకుంటే మెగా బ్రదర్స్ ఇద్దరూ నోరు మెదపలేదని.. ఇప్పుడేమో ఏపీలో ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగిందని ఆరోపిస్తూ క్లారిటీ లేని పాలిటిక్స్ చేస్తున్నాడని’ అని నెటిజన్స్ నాగబాబు మీద విమర్శలు చేస్తున్నారు. మొత్తానికి నాగబాబు పవన్ కళ్యాణ్ కు తలనొప్పిగా మారుతున్నాడని.. పవన్ రాజకీయాంగా సక్సెస్ కాకపోవడానికి కారణం అయ్యాడని పవన్ ఫ్యాన్స్ కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Loading...