Wednesday, April 24, 2024
- Advertisement -

జన్మలో మరిచిపోలేని ఆతిథ్యాన్ని జగన్ ఇచ్చారు : చిరంజీవి

- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి కొన్ని నెలల క్రితం ఏపీలోని అమరావతికి వెళ్లి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిసిన విషయం తెలిసిందే. అయితే ఈ సమావేశం పై చాలా ఊహాగానాలు వినిపించాయి. అలానే చిరు కానీ జగన్ కానీ ఈ సమావేశం అనంతరం మాట్లాడలేదు. తాజాగా జగన్ ను ఎందకు కలవాల్సి వచ్చిందనే విషయంపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు.

చిరు మాట్లాడుతూ..”వైఎస్ ఆర్ ఫ్యామిలీతో నాకు చాలా కాలంగా మంచి స్నేహపూర్వక సంబంధం ఉందని.. నేను కూడా సాక్షి దినపత్రిక ప్రారంభోత్సవంలో పాల్గొన్నాను. ఇక వైఎస్ భారతి ఆహ్వానం మేరకు సాక్షి ఎక్స్ లెన్స్ అవార్డుల కార్యక్రమానికి కూడా హాజరయ్యానని చిరంజీవి గుర్తు చేసుకున్నారు. భారతి తనను రిసీవ్ చేసుకున్న విధానం చూసి ముగ్దుడయ్యానని.. నన్ను ఎంతో గౌరవించారని” చిరు చెప్పారు. ఇక సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారానికి తనని ఆహ్వానించారని కానీ దానికి హాజరు కాలేకపోయానని చిరు చెప్పారు. సైరా సినిమాను తీసినప్పుడు ఏపీ నాయకులందరికీ చూపించాలని అనుకున్నానన్నారు.

అందులో భాగంగానే సీఎం జగన్ కు చూపించాలని తాను జగన్ అపాయింట్ మెంట్ కోరానన్నారు. జగన్ తనను ఆఫీసుకు రమ్మనకుండా ఇంటికి ఆహ్వానించారని.. తన భార్య సురేఖతో వెళితే జన్మలో మరిచిపోలేని ఆతిథ్యాన్ని జగన్-భారతి ఇచ్చారని చిరంజీవి గుర్తు చేసుకున్నారు. ఇక జగన్ ఆహ్వానిస్తే వైసీపీలోకి వెళ్తారా అన్న ప్రశ్నకు.. తాను రాజకీయాలకు దూరంగా ఉంటున్నానని.. ఏదైనా రాజకీయ అంశంపై తన అభిప్రాయాలను చెబుతున్నానని.. మూడు రాజధానులకు కూడా మద్దతిచ్చానని.. ప్రస్తుతానికి తన ఫోకస్ కేవలం సినిమాలపైనే అని చిరు స్పష్టం చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -