కరోనా బాధితులకు సత్య నాదెళ్ల, నితిన్ భారీ విరాళం..!

764
microsoft ceo satya nadella wife anupama donates to anti corona battle
microsoft ceo satya nadella wife anupama donates to anti corona battle

కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలను గజగజ వణికిస్తోంది. అగ్రరాజ్యాలు సైతం ఈ వైరస్ తో పోరాటం సాగిస్తున్నారు. ఈ కరోనా వైరస్ కు వ్యాక్సిన్ లేకపోవడం.. అత్యుత్తమ చికిత్స అని అందరి అభిప్రాయం. ఈ నేపథ్యంలో కరోనాపై పోరాటానికి మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల అర్ధాంగి అనుపమ భారీ విరాళంతో ముందుకొచ్చారు.

కరోనా నివారణకు అనుపమ రూ. 2 కోట్ల విరాళం ప్రకటించారు. ఈ విరాళాన్ని అనుపమ తండ్రి తెలంగాణ సీఎం సహాయనిధికి అందజేశారు. ఇక యంగ్ హీరో నితిన్ రూ10 లక్షల విరాళం ప్రకటించారు. దీనికి సంబంధించిన చెక్కును ముఖ్యమంత్రి కేసీఆర్ కు అందజేశారు. ఇక మిగిత హీరోలు కూడా తమ వంతు సాయం చేస్తున్నారు. రాజశేఖర్ దంపతులు సినీ కళాకారులకు నిత్యావసర వస్తువులను అందిస్తున్నారు.

కారోనా భూతం వ్యాప్తి చెందకుండా ఉండాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ ప్రకటించిన క్రమంలో రోజువారి కూలీలు అనేక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో వారికి సాయం కోసం ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుంది.

Loading...