పవన్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన రాపాక వరప్రసాద్

733
MLA Rapaka Sensational Comments on Pawan Kalyan
MLA Rapaka Sensational Comments on Pawan Kalyan

జనసేన ఏకక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ వీలుచిక్కినప్పుడల్లా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై అలాగే జనసైనికులపై విరుచుకు పడుతూ ఉంటారు. తాజాగా మరోసారి ఆయన పవన్ టార్గెట్ గా కొన్ని విమర్శలు కురిపించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన జనసేన ఎమ్మెల్యే రాపాక తాను ఇప్పటికీ జనసేన ఎమ్మెల్యేనే కాకపోతే వైసీపీ కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి అనుకూలంగా అన్నారు. తాను 2019 ఎన్నికల్లో వైసీపీ టిక్కెట్ ట్రై చేశానని.. కానీ ఇవ్వలేదని అన్నారు.

జనసేన వాళ్ళు తన దగ్గరకు వచ్చి పోటీ చేయమన్నరని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో జనసేన పార్టీకి అధినేత ఒక్కరే ఉన్నారు అని కేడర్ లేదు అని తాను పార్టీ కమిటీని వెయాలని చెప్పినా పట్టించుకోలేదని అన్నారు. అలాగే చిరంజీవి పవన్ కళ్యాణ్ మధ్య తేడా ఉందని చిరంజీవి అందరితో కలిసి ఉండేవారని అన్నారు. పవన్ మాత్రం అలా కాదు అని చెప్పుకొచ్చాడు. నాయకుడు ప్రజలతో మమేకమై ఉండాలని.. అలా ఉన్నందువల్లే సీఎం జగన్ ఈరోజు ఈ స్థితిలో ఉన్నారని చెప్పారు. నాదెండ్ల మనోహర్.. పవన్ ను తప్పుడు దారిలో తీసుకెళ్తున్నారని తాను భావిస్తున్నానని అన్నారు.

తన విషయంలోనే ఇది జరిగిందని గెలిచిన తనను పక్కన పెట్టుకోకుండా నాదెండ్ల మనోహర్ ను పక్కన పెట్టుకోవడాని అందరూ గమనించారని అన్నారు. పార్టీలో ఉన్న వాళ్ళు అదే అనుకుంటున్నారు అని అన్నారు. దిండి మీటింగ్ కు తనను పిలవలేదని.. నాదెండ్ల మనోహర్ తనను ఏమన్నారో అందరికీ తెలుసని అన్నారు. తనతో బొట్టు పెట్టి పిలవరు కదా అన్నారని తర్వాత తానే కూర్చి తెచ్చి వేసుకునాన్నని గుర్తు చేశారు. అలాగే సోషల్ మీడియాలో ఉన్నవాళ్ళు ఓటు వేసి గెలిపించడానికి పని చేయారని పార్టీ అభివృద్ధికి పనికిరారని కేవలం ఇంకొక్కర్ని తిట్టడానికి పనికొస్తారని జనసైనికులు ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణ హోంమంత్రికి కరోనా పాజిటివ్..!

ఎందుకయ్యా చిట్టినాయుడూ.. గొడవలోకి మీ ఆవిడను లాగుతావ్ : విజయ సాయి

విశాఖ నుంచే పరిపాలన.. జగన్ ఫిక్స్..!

ఉచితంగా ఇసుక పంపిణీ : జగన్ సంచలన నిర్ణయం..!

Loading...