జగన్ అంటే ఆ వైసీపీ ఎమ్మెల్యే మండిపడుతోందట…?

- Advertisement -

ప్రభుత్వం అన్నాకా అందరి ఎమ్మెల్యేలను మెప్పించడం చాలా కష్టం.. చాల సమీకరణాల దృష్ట్యా ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వడం, వారికి తగ్గ పదవులు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో పార్టీ కోసం కష్టపడిన వారిలో కొంతమందికి అనుకున్న పదవులు, ఉన్నత స్థానాన్ని కల్పించడం కుదరకపోవచ్చు.. అందుకే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తన మంత్రి వర్గ విస్తరణం ను రెండు భాగాలుగా చీల్చి రెండున్నరేళ్ళకోసారి మంత్రి వర్గ విస్తరణ చేయాలనీ నిర్ణయించారు.. ఈ నేపథ్యంలో మొదటి మంత్రి వర్గ విస్తరణలో చాలామంది కి మొండి చేయి చూపాల్సి వచ్చింది.. రోజా వంటి కీలక మైన మహిళా నేతలకు ఎలాంటి పదవులు ఇవ్వకుండానే జగన్ సరిపుచ్చాడు..

ఇక తాజాగా ఓ మహిళా ఎమ్మెల్యే జగన్ పై కొంత అసహనం గా ఉందని తెలుస్తుంది. అందుకు కారణం ఆమెకు పార్టీ లో సరైన సముచిత స్థానం ఇవ్వకపోవడమే కారణం అంటున్నారు.. పార్టీ కోసం మొదట్నుంచి కష్టపడుతూ ఎంతో సన్నిహితంగా జగన్ తో ఉన్నా కూడా తనకు సరైన విలువ ఇవ్వడం లేదని ఆమె వాదన.. పార్టీ కోసం.. ప‌నిచేసి.. ఓట‌ములు ఎదుర్కొని.. ప్రత్యర్థుల నుంచి అనేక విమ‌ర్శలు చ‌విచూసినా ఉన్నత స్థానం కల్పించకపోవడం పార్టీ కోసం కృషి చేసిన వారిలో అంతో ఇంతో బాధ ఉండ‌డం స‌హ‌జం. జ‌గ‌న్ అధికారంలోకి రావాల‌ని కోరుకున్నవారిలో రాష్ట్రంలో ఆ చివ‌రి నుంచి ఈ చివ‌రి వ‌ర‌కు ఎంతో మంది ఉన్నారు. ఈ లిస్టులో చాలా మందే ఉన్నారు. వారిలో ఇప్పుడు ఎమ్మెల్యేలుగా రెండు నుంచి ఐదు సార్లు గెలిచిన వారు ఎలాంటి ప్రయార్టీ లేక‌పో‌వ‌డంతో వారిలో అసహనం మామూలుగా రగిలిపోవ‌డం లేదు.

- Advertisement -

 శ్రీకాకుళం జిల్లా పాత‌ప‌ట్నం ప్రస్తుత ఎమ్మెల్యే రెడ్డి శాంతి జగన్ పై అసహనం విషయంలో మొదటివరుసలో ఉన్నారట..  శ్రీకాకుళం జిల్లా ప‌రిష‌త్ మాజీ చైర్మన్‌ పాల‌వ‌ల‌స రాజ‌శేఖ‌రం కుమార్తె అయిన రెడ్డి శాంతి పార్టీ ఆవిర్భావం నుంచి కష్టపడి పనిచేశారు. నిన్నగాక మొన్న పార్టీ లోకి వచ్చిన వారికి పెత్తనం ఇవ్వడం ఆమెకు నచ్చడం లేదట.. దాంతో జగన్ పై బహిరంగంగానే అసహనం వ్యక్తం చేస్తున్నారట ఆమె..  మంత్రి ప‌ద‌వి ఆశించిన రెడ్డి శాంతికి క‌నీసం నామినేటెడ్ ప‌ద‌వి కూడా ఇవ్వలేదు. పార్టీ కోసం ఎంతో ఖ‌ర్చు చేసి.. అప్పుడున్న ప‌రిస్థితుల్లో ఎంపీగా పోటీ చేసేందుకు ఎవ్వరూ ముందుకు రాక‌పోయినా తాను ఎంతో క‌ష్టప‌డ్డాన‌ని ఆమె వాపోతోన్న ప‌రిస్థితి.

Most Popular

మన స్టార్ హీరోయిన్స్ అసలు పేర్లు ఏంటో తెలుసా ?

ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్స్ గా ఉన్న ప్రతి సెలబ్రిటీ పేరు మార్చుకునే ఇండస్ట్రీలోకి వచ్చిన విషయం తెలిసిందే. హీరోలు మాత్రమే కాకుండా, హీరోయిన్ల కూడా వారి పేర్లు మార్చుకొని ఇండస్ట్రీకి...

అప్పట్లో నన్ను కూడా వేధించారు : హీరోయిన్ ఆమని

ఎస్.వి కృష్ణ రెడ్డి దర్శకత్వం వహించిన “శుభలగ్నం” అనే సినిమాలో హీరోయిన్ గా నటించి ఎంతో మంది ప్రేక్షకుల అభిమానాన్ని అందుకుందు ఆమని. అప్పట్లో ఆమని.. వెంకటేష్, జగపతి బాబు,...

కాజల్ కొత్త ఇల్లు.. సర్ ఫ్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన బెల్లంకొండ..!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో ఒకరైన కాజల్ అగర్వాల్ గత కొన్ని ఏళ్ళుగా ప్రేమలో ఉన్న గౌతమ్ తో ఈ నెల30న పెళ్లి చేసుకోబోతున్న విషయం మనందరికి తెలిసిందే. ఇప్పటికే...

Related Articles

చంద్రబాబుకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన హైకోర్ట్..!

చేసిన తప్పు నుంచి తప్పించుకోవాలంటే చంద్రబాబు తర్వాత ఎవరైనా. చంద్రబాబు 40 ఏళ్ల రాజకీయ చరిత్రలో చేస్తూ వచ్చింది కూడా ఇదే. చంద్రబాబు వ్యవస్థను బాగా మేనేజ్ చేస్తారని మొదటి...

వైద్య ఆరోగ్య శాఖలో అవినీతిపై జగన్ కన్నెర్ర

ప్రజారోగ్యాన్ని అందించాల్సిన ఆరోగ్య విభాగానికి అవినీతి జబ్బు చేసింది. కొందరు అధికారుల భాగోతాలు "అవినీతి రహిత పాలన " అంటున్న ముఖ్యమంత్రి కి తలవంపులు తెస్తున్నాయి. కోట్ల మంది ప్రజల...

వైఎస్సార్ ని మించి పోయిన జగన్.. పాలన భేష్..?

రాష్ట్రంలో జగన్ ఎంతో సమర్దవంతం గా పాలన అందిస్తున్న సంగతి అందరికి తెలిసిందే.. మూడు రాజధానుల విషయంలో ఆయన చూపిస్తున్న దార్శనికత కి ప్రతి ఒక్కరు సమర్దిస్తున్నారు.. అన్ని ప్రాంతాలు...
- Advertisement -
Loading...

Recent Posts

- Advertisement -
Loading...