అంబులెన్స్ నడిపిన ఎమ్మెల్యే రోజా.. వీడియో..!

739
mla roja drives new ambulance
mla roja drives new ambulance

నగరిలో కొత్తగా వచ్చిన 108, 104 వాహనాలను ఎమ్మెల్యే రోజా ప్రారంభించారు. ఆ తర్వాత ఆమె 108 వాహనం డ్రైవింగ్ సీట్లో కూర్చుకున్నారు. ఆమె సరదాగా కాసేపు డ్రైవింగ్ చేశారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ.. ప్రజారోగ్యానికి సీఎం జగన్ గారు పెద్ద పీట వేస్తున్నారని అన్నారు.

ఇందులో భాగంగానే కొత్తగా 108, 104 వాహనాలను కొనుగోలు చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారని తెలిపారు. ప్రతి రాష్ట్రంలోని ప్రజలు తమకు జగన్ గారు లాంటి సీఎం కావాలని కోరుకుంటున్నారని చెప్పారు. చంద్రబాబు, ఆయన పార్టీ టీడీపీ నేతలు తిన్నది అరక్క విమర్శలు చేస్తున్నారని రోజా మండిపడ్డారు. 203 కోట్లతో అంబులెన్స్ వాహనాలు ఏర్పాటు చేస్తే వందల కోట్లలో అవినీతి జరిగిందంటూ టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని ధ్వజమెత్తారు.

ఇక ఇటీవలే వెయ్యికిపైగా 108, 104 వాహనాలను ఏపీ సర్కారు అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయవాడలో జెండా ఊపి ప్రారంభించారు. ఆ తర్వాత విజయవాడ నుంచి రాష్ట్ర నలుమూలాలకు ఆ వాహనాలు తరలివెళ్లాయి. ఈ వాహనాల్లో 676 వాహనాలు 104వి కాగా, మరో 412 వాహనాలు 108 అంబులెన్స్‌లు. రోజా వాహనం డ్రైవింగ్ చేసిన వీడియోని మీరు కూడా చూడండి.

జగన్ ని అభినందించిన పవన్..!

పదవిని మూన్నాళ్ళ ముచ్చటగా చేసుకోకండి : జగన్ పై ముద్రగడ కామెంట్స్

రఘురామకృష్ణరాజు పై అనర్హత వేటు..?

కృష్ణ జిల్లాలో ఆ వైసీపీ ఎమ్మెల్యే టాప్ లో ఉన్నాడట..!

Loading...