Friday, March 29, 2024
- Advertisement -

గాజువాకలో చిత్తుగా ఓడిపోయాడని.. వైజాగ్ పై పవన్ కి కసి : రోజా

- Advertisement -

ఏపీకి మూడు రాజధాలు అంశం ఖరారు ఖావడంతో.. ఈ నిర్ణయాన్ని ప్రతిపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయి. అధికార పార్టీ వైసీపీ పై విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ వారు కూడా గట్టిగానే కౌంటర్లు విసురుతున్నారు. తాజాగా ఎమ్మెల్యే రోజా ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు.. పవన్, చంద్రబాబులను టార్గెట్ చేసి కామెంట్స్ చేశారు.

తన బినామి ఆస్తులు పెంచుకోవడం కోసమే చంద్రబాబు మూడు రాజధానులను వ్యతిరేకిస్తున్నారని రోజా అన్నారు. ఇక గాజువాకలో పవన్ కళ్యాణ్ చిత్తుగా ఓడిపోయారు. అందుకే వైజాగ్ పై పవన్ కసి పెంచుకున్నారా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రజలు చాలా ఆలోచిస్తున్నారని.. చంద్రబాబు మాయ చేస్తే ఇప్పుడు ప్రజలు నమ్మరని అన్నారు. టీడీపీ దిగజారుడు రాజకీయాలు మానుకోక పోతే… ఉన్న 23 ఎమ్మెల్యేల సంఖ్య సున్నాకి పడిపోతుందన్నారు రోజా.

అమరావతి సెంటిమెంట్ నిజంగా ఉందని నమ్మితే 23 ఎమ్మెల్యేలు రాజీనామా చేసి తిరిగి గెలవాలని సవాల్ చేశారు. సోమవారం ఉదయం ఫ్యామిలీతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు రోజా. అనంతరం మాట్లాడిన రోజా సీఎం జగన్ కు రాఖీ శుభాకాంక్షలు చెప్పారు. మహిళల భద్రత కోసం సీఎం జగన్ కృషి చేస్తున్నారని.. రాఖీ సందర్భంగా మహిళల భద్రతకు మరో అడుగు ముందడుగు వేశారని.. సైబర్ నేరగాళ్ల వలలో పడకుండా మహిళలకు అవగాహన కార్యక్రమాలు చేపట్టడం శుభ పరిణామం అన్నారు.

మహిళలకు రక్షణగా దిశ చట్టం మాత్రమే కాకుండా మహిళల కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టారన్నారు రోజా. రక్ష బంధన్ సందర్భంగా జగనన్న ఉన్నాడనే భరోసాతో భద్రతగా, గౌరవంగా బయటకు వచ్చామన్నారు. జగనన్న ఉన్నాడనే భరోసా ఇలాగే మరో 30, 40 ఏళ్లు ఉండాలని కోరుకుంటున్నాను అని రోజా అన్నారు.

మూడు రాజ‌ధానులు.. నాలుగు జోన్లు.. 25 జిల్లాలు.. జ‌గ‌న్ పాలన అదరహో..!

జగన్ తన వ్యూహాలతో బాబును తికమక పెట్టాడు.. ?

జగన్ కమిట్మెంట్ చూసి షాక్ అయ్యా.. కానీ మోసం : రఘురామ

చంద్రబాబుకు కొడాలి నాని ఊహించని సవాల్..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -