Saturday, April 20, 2024
- Advertisement -

ఇంద్రభవనంలో కూర్చోని తండ్రీకొడుకులు బురద చల్లుతున్నారు: శ్రీకాంత్‌రెడ్డి

- Advertisement -

విపత్కర పరిస్థితుల్లో మాకు రాజకీయాలు ముఖ్యం కాదని, ప్రజలకు భరోసా కల్పించడమే ముఖ్యమని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి పేర్కొన్నారు. కరోనా విషయంలో సీఎం వైయస్‌ జగన్‌ ప్రజలకు భరోసా కల్పిస్తున్నారని, చంద్రబాబు మాదిరిగా రాజకీయాలు చేయడం లేదని చెప్పారు. హైదరాబాద్‌లోని ఇంద్రభవనంలో కూర్చొని తండ్రీకొడుకులు ప్రభుత్వంపై బురదజల్లుతున్నారని మండిపడ్డారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రభుత్వానికి రాసిన లేఖలో ఉపయోగపడే అంశాలేవీ లేవని కొట్టివేశారు. మంగళవారం శ్రీకాంత్‌రెడ్డి తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.

దేశానికే మార్గదర్శకంగా ఏపీ
కరోనా నియంత్రణలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం దేశానికే మార్గదర్శకంగా మారిందని కేంద్ర మంత్రులు, జాతీయ మీడియా పేర్కొంటుందని శ్రీకాంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఉత్తర కొరియా నుంచి ప్రత్యేక కిట్లు తెప్పించి దేశంలోనే అత్యధిక టెస్టులు చేసిన రాష్ట్రం ఏపీనే అన్నారు. ప్రతి 10 లక్షల జనాభాకు దాదాపు 14 శాతం పరీక్షలు చేసిన రాష్ట్రం మనదే అన్నారు. వైద్యులకు పీపీఈ కిట్లు, ఎన్‌–95 మాస్కులు సమృద్ధిగా అందజేస్తుంటే చంద్రబాబు ఆరోపణలు చేయడం సిగ్గు చేటు అన్నారు. ఎక్కడైనా కొరత ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి కానీ, తప్పుడు ప్రచారం చేయడం సరికాదన్నారు.

వలస కార్మికులకు ప్రత్యేక షెల్టర్స్‌
లాక్‌డౌన్‌ నేపథ్యంలో రాష్ట్రంలో వలస కార్మికుల కోసం ప్రత్యేక షెల్టర్స్‌ ఏర్పాటు చేశామని గడికోట శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. ఈ షెల్టర్స్‌లో కూలీలకు విందు భోజనాలు పెట్టిస్తున్నామన్నారు. డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో మంచి పౌష్టికాహారం పెడుతుంటే విమర్శలు చేయడం ఏంటని ప్రశ్నించారు. వలస కూలీలు, చేనేతల గురించి చంద్రబాబు మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. రెడ్‌జోన్‌ ప్రాంతాలు, పేదలకు ప్రభుత్వంతో పాటు వైయస్‌ఆర్‌కాంగ్రెస్‌ పార్టీ కూడా సహాయ సహకారాలు అందిస్తుందన్నారు. వలస కార్మికులను ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని చెప్పారు.

రైతుల గురించి బాబు మాట్లాడుతుంటే నవ్వుతున్నారు
చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు వ్యవసాయాన్ని పట్టించుకోలేదని, అలాంటి వ్యక్తి ఇవాళ వ్యవసాయం గురించి మాట్లాడుతుంటే రైతులు నవ్వుతున్నారని శ్రీకాంత్‌రెడ్డి పేర్కొన్నారు. వ్యవసాయానికి ఇలాంటి రోజులు దశాబ్ధకాలం తరువాత వచ్చిందన్నారు. రైతులను ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని, లాక్‌డౌన్‌ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా 1100 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు అండగా ప్రభుత్వం నిలిచిందన్నారు. 4 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామన్నారు. చంద్రబాబు హయాంలో ఎప్పుడైనా ఇలాంటి చర్యలు చేపట్టారా? ఒక్క క్వింటాల్‌ ధాన్యమైన కొనుగోలు చేశారా అని నిలదీశారు. గతేడాది 7 లక్షల మెట్రిక్‌ టన్నుల దిగుబడి వస్తే..ఈ ఏడాది 11 లక్షల మెట్రిక్‌ టన్నులు వచ్చిందన్నారు. వ్యవసాయ ఉత్పత్తులు 1 శాతం, చేపల ఉత్పత్తులు 19 శాతం ఉంటే వ్యవసాయ రంగం గ్రోత్‌రేట్‌ 20 శాతమని చంద్రబాబు చూపించుకున్నారని, మా ప్రభుత్వంలో వ్యవసాయ ఉత్పత్తులే 14 శాతం వచ్చాయని వివరించారు. కేంద్రంతో సీఎంవైయస్‌ జగన్‌ మాట్లాడి ప్రకాశం జిల్లాలో మూడు పొగాకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయించారని గుర్తు చేశారు. సంక్షోభ సమయంలో చంద్రబాబు కన్ఫిజ్‌ క్రియేట్‌ చేసి ప్రజలను మభ్యపెట్టాలని ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.

ప్రజలకు సీఎం వైయస్‌ జగన్‌ భరోసా
సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి కరోనా విషయంలో ప్రజలకు భరోసా కల్పిస్తున్నారని ఎమ్మెల్యే గడికోట తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా ముప్పు ఇప్పట్లో పోదన్నారని, సీఎం వైయస్‌ జగన్‌ కూడా ఇదే అన్నారని వివరించారు. ఎల్లో మీడియా తప్పుడు కథనాలు, ప్రజలను భయాందోళనకు గురి చేసే వార్తలు రాస్తుందన్నారు. మరణమే శరణ్యమంటూ చంద్రబాబులాగా ఇంట్లో కూర్చోవడం సీఎం వైయస్‌ జగన్‌ నైజం కాదన్నారు. ప్రజలకు భరోసా కల్పిస్తూ అండగా ఉన్నారన్నారు.

ఏపీ వస్తానని బాబు ఎప్పుడు అడగలేదు
దాదాపు 40 రోజుల పాటు హైదరాబాద్‌లోని ఇంద్రభవనంలో చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్‌ ఎంజాయ్‌ చేస్తున్నారని శ్రీకాంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఆయన ఏపీకి వస్తానని ప్రభుత్వాన్ని కోరలేదన్నారు. చంద్రబాబు వస్తే కార్వంటైన్‌కు పంపిస్తామని మా మంత్రులు పేర్కొన్నారన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు వస్తానంటే ఆయన ఇల్లీగల్‌గా నివాసం ఉంటున్న కరకట్టపైన ఉన్న ఇంట్లో క్వారంటైన్‌ ఏర్పాటు చేస్తామని చెప్పారు.

కనగరాజ్‌పై ఆరోపణలు సరికాదు
రాజ్‌భవన్‌కు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ కనగరాజ్‌ౖò రావడం వల్లే కరోనా వచ్చిందంటూ చంద్రబాబు ఆరోపణలు చేయడం దుర్మార్గమన్నారు. దళితుడు, రిటైర్డు జడ్జి అయిన కనగరాజ్‌పై ఇలాంటి వ్యాఖ్యలు సరికాదన్నారు. రాష్ట్రపతి భవన్‌లో కూడా కరోనా సోకిందని, చంద్రబాబు అలాగే మాట్లాడుతారా అని ప్రశ్నించారు.

సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు ఎందుకు సాయం చేయడం లేదు
చంద్రబాబు, టీడీపీ నేతలు సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు ఎందుకు విరాళం ఇవ్వడం లేదని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ ప్రశ్నించారు. అమరావతి కోసం చంద్రబాబు తన భార్య చేతులకు ఉన్న గాజులు విరాళంగా ఇప్పించారని, జోలే కట్టుకోని వీధుల్లో తిరిగిన చంద్రబాబు కరోనా నేపథ్యంలో సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు రూ.10 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకున్నారన్నారు. టీడీపీ నేతలు ఎందుకు విరాళాలు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ప్రజలపై వీరికి ప్రేమ లేదా అని నిలదీశారు.

ప్రజల్లో ధైర్యాన్ని నింపుతున్నాం
కరోనా కేసులు తక్కువ చేసి చూపుతున్నారని ప్రతిపక్ష నేత ఆరోపించడం సరికాదన్నారు. ప్రస్తుతం జరుగుతున్న యుద్ధం వైయస్‌ఆర్‌సీపీ, టీడీపీ మధ్య కాదని, కరోనాకు, ప్రజలకు మధ్యే అన్నారు. ప్రజల్లో ధైర్యాన్ని నింపుతున్నామని, ప్రతిపక్షం అన్నది ఏదైనా పొరపాట్లు ఉంటే ప్రభుత్వానికి సూచనలు చేయాలన్నారు. ప్రతిసారి రాజకీయాలు చేయడం ప్రతిపక్షాలకు తగదన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ చంద్రబాబు మౌత్‌ పీస్‌గా మారారని విమర్శించారు. కిట్ల కొనుగోలులో ఆయనే అనుమానం అన్నాడు.. ఆరోపణలు చేశారని గుర్తు చేశారు. సీఎంగా ప్రమాణం చేసిన రోజే వైయస్‌ జగన్‌ అవినీతిరహిత, పారదర్శక పాలన అందిస్తానని మాట ఇచ్చారని, అలాగే పరిపాలన అందిస్తున్నారన్నారు. ఇచ్చిన ప్రతి హమీని ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా నెరవేర్చుతున్నారని తెలిపారు. సున్నా వడ్డీ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అందజేస్తున్నారని, ప్రతి పేద కుటుంబానికి రూ.1000 ఆర్థికసాయం చేశారని, మూడుసార్లు ఉచితంగా రేషన్‌ ఇచ్చారని శ్రీకాంత్‌రెడ్డి వివరించారు. ఇప్పటికైనా ప్రతిపక్షాలు లేనిపోని ఆరోపణలు మానుకొని, ప్రజలకు మద్దతుగా నిలవాలని శ్రీకాంత్‌రెడ్డి సూచించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -