Friday, April 19, 2024
- Advertisement -

మోడీ సర్కార్ నుండి జగన్ సర్కార్ కు గుడ్ న్యూస్..!

- Advertisement -

కేంద్రంలో పవర్ లో ఉన్న బీజీపీతో.. రాష్ట్రంలో పవర్ తో ఉన్న వైసీపీ మంచి సంబంధాలతో మెలుగుతున్న విషయం తెలిసిందే. దాంతో మోడీ సర్కార్ సైతం జగన్ సర్కార్ కు ప్రయోజనం అయ్యే కీలక అంశంలపై నిర్ణాయాలు తీసుకుంటుంది. తాజాగా ఏపీ సర్కార్ కు మోడీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది.

కడప నుండి రేణిగుంట వరకు నాలుగు వరుసల హైవేకు మోడీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నేషనల్‌ హైవేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా త్వరలో ఈ హైవేకు టెండర్లను పిలవనుంది. ఈ నాలుగు వరుసల హైవే వల్ల హైదరాబాద్ – తిరుపతి, హైదరాబాద్ – చెన్నైలకు ప్రయాణ సమయం తగ్గనుంది. ఈ హైవే మార్గంను కొన్ని రోజుల క్రితం కేంద్రం గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ వేగా గుర్తించింది. ప్రస్తుతం రెండు వరుసలుగా ఉన్న ఈ రోడ్డును నాలుగు వరుసలుగా మార్చాలని తీసుకున్న నిర్ణయంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ రహదారి నిర్మాణంలో దాదాపు కడప జిల్లాలోనే 100 కిలోమీటర్ల మేర రహదారి నిర్మాణం జరగనుంది.

3 వంతెనలు, 2 రైల్వే ఓవర్‌ బ్రిడ్జిలు నిర్మించి నాలుగు లేన హైవే మార్గాన్ని పూర్తి చేయనున్నారు. ఎన్‌హెచ్‌ఏఐ కడపలోని బద్వేల్ నుంచి నెల్లురు కృష్ణపట్నం పోర్టు వరకు 138 కిలోమీటర్ల రహదారి నిర్మాణం కొరకు ఇప్పటికే డీపీఆర్ ను సిద్ధం చేసింది. అధికారులు ఇప్పటికే భూసేకరణ చేపట్టారు. వైఎస్సార్ టోల్ ప్లాజా నుండి రేణిగుంట వరకు 4 లేన్ల నిర్మాణం జరుగుతుందని సమాచారం. ఈ ప్రాజెక్ట్ రాబోయే నాలుగు సంవత్సరాలలో పూర్తవుతుందని అధికారులు చెబుతున్నారు.

చంద్రబాబుకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన హైకోర్ట్..!

నమ్మకం కోల్పోయాక కాళ్ళబేరానికి వస్తే ఏం లాభం.?

చంద్రబాబు ఎంత చెప్పిన ఈ ట్రిక్స్ ఆపడా..?

అబ్బో.. అచ్చెన్న వైసీపీకి తొలి సవాల్..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -