Thursday, March 28, 2024
- Advertisement -

చంద్రబాబు పై పగ ను మోడీ ఇలా తీర్చుకోబోతున్నాడా…!!

- Advertisement -

ఆంధ్రప్రదేశ్ లో ప్రధాని మోడీ మంచి ప్లాన్ వేశాడని అనిపిస్తుంది.. ఇక్కడ పార్టీ ని బలోపేతం చేయడానికి వేసిన ప్రణాళికల్లో భాగంగా సోము వీర్రాజు ఎన్నిక చాలా కీలకమైంది..ఎందుకంటే సోము వీర్రాజు చంద్రబాబు ను టార్గెట్ చేయని రోజు లేదు. ప్రతి విషయంలోనే ఆయన బాబు టార్గెట్ చేయడం ద్వారా పార్టీ వీక్ అయి వైసీపీ ని తర్వాత చూసుకోవచ్చనే భావం ఉంది.. ఇక అదేవిధంగా బాబు మోడీ ల మధ్య జరిగిన ఓ వివాదాన్ని ఇప్పుడు మోడీ సోము వీర్రాజు చెప్పి మరింత ఉసిగొల్పుతున్నాడని వార్తలు బయటకి వస్తున్నాయి..

మోడీ గుజరాత్ కి దాదాపు పుష్కర కాలం సీఎం గా ఉన్న స్నాగతి తెలిసిందే.. అప్పుడు మోడీ అక్కడ చెప్పిందే వేదం.. ఇతర పార్టీ నాయకులకు అసలు అవకాశం ఉండేది కాదు. ఆ టైం లో మోడీ పై గోద్రా ఘటన పై చాలా విమర్శలు వచ్చాయి.. 2002 లో జరిగిన ఈ సంఘటన లో మోడీ కి ప్లస్ ల కంటే మైనస్ లు ఉన్నాయి కనుక. సరే గోద్రా ఘటన తరువాతనే మోడీ జాతీయ, అంతర్జాతీయంగా మారుమోగారు. ఇక దేశంలో యాంటీ మోడీ ఉద్యమం కూడా నాడు జరిగింది. అపుడు వాజ్ పేయి ప్రధాని, ఆయన రాజధర్మం గురించి కూడాచెప్పారు. మోడీ మీద వాజ్ పేయి అలా మండడానికి కారణం నాటి ఎన్డీయే కన్వీనర్ చంద్రబాబు అన్నది తెలిసిందే. మోడీని సీఎం కుర్చీ దిగమన్న బాబు హైదరాబాద్ వస్తే అరెస్ట్ చేస్తానని కూడా ఆనాడు గద్దించారు. ఇపుడు అదే మోడీకి సోము వీర్రాజు మరో మారు ఫ్లాష్ బ్యాక్ చెప్పి మరీ గుర్తు చేస్తున్నారు.

మోడీ మీద పగబట్టిన బాబు నాడు ఆయన్ని బీజేపీ నుంచి సస్పెండ్ చేయమని బాబు డిమాండ్ చేశారని సోము వీర్రాజు గత చరిత్ర మళ్ళీ వల్లె వేస్తున్నారు. నాడు బాబు మాటే బీజేపీ విని ఉంటే మోడీని బీజేపీ నుంచి తప్పించి ఉంటే ఈ రోజు దేశానికి మంచి ప్రధాని లేకుండా పోయేవారని సోము వీర్రాజు అంటున్నారు. అలా నాటికీ నేటిలీ లింక్ పెట్టి బాబుని బాగా ఆడిపోసుకుంటున్నారు. బాబు బ్లాక్ మెయిల్ పాలిటిక్స్ ని బీజేపీ చూసేసిందని కూడా అంటున్నారు.ఏదేమైనా వీరావేశం వీర్రాజు ఈ కక్ష్య సాధింపు రాజకీయాలు చేయడం ఎక్కువైతే చంద్రబాబు ఉనికి రాష్ట్రంలో కష్టమే..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -