Thursday, March 28, 2024
- Advertisement -

జ‌గ‌న్‌కు భ‌య‌ప‌డే చంద్ర‌బాబు ప్ర‌త్యేక‌హోదా విష‌యంలో యూట‌ర్న్ తీసుకున్నారు..

- Advertisement -

ఏపీ సీఎం చంద్ర‌బాబును తెలంగాణ టీడీపీ బహిష్కృతనేత మోత్కుప‌ల్లి న‌ర‌శింహులు మ‌రోసారి ఏకి పారేశారు. ఏపీకీ ప్ర‌త్యేక హోదా రావాలంటే బాబును ప‌క్క‌న పెట్టాల‌ని సూచించారు. 2019 ఎన్నిక‌ల్లో బాబు ఓట‌మిని చూడాల‌ని తిరుమల కొండపైకి ఎక్కేటప్పుడు ప్రతి మెట్టుకు మొక్కుకున్నానని తెలిపారు. కొండ ఎక్కే క్రమంలో తనకు బీపీ కూడా డౌన్ అయిందని… రెండు రోజులు ఆసుపత్రిలో చికిత్స కూడా చేయించుకున్నానని తెలిపారు.

బాబు జీవితం అంతా మోసం, వంచ‌న‌, నాట‌కం, ద‌గా మోసాలేన‌ని మండిప‌డ్డారు. అవిశ్వాసంపై చర్చలో ఏపీకీ హోదా ఇవ్వాలని ఎవరైనా మాట్లాడారా అని, టీడీపీ పెట్టిన అవిశ్వాసంపై ఎవరైనా కలిసొచ్చారా అని ప్రశ్నించారు.

దివంగత నేత ఎన్టీఆర్‌ జెండాను చంద్రబాబు దొంగతనం చేశాడని మండిపడ్డారు. బాబు ఆంధ్రుల ఆత్మ గౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టారని, ఆయన ఎన్టీఆర్‌కే కాదు.. ఆంధ్రులకు వెన్నుపోటు పోడిచారని దుయ్యబట్టారు. అసెంబ్లీలో ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌ చాలా సార్లు హోదాపై బాబును ప్రశ్నించారని, హోదా రాకుండా అడ్డుపడింది చంద్రబాబే అని స్పష్టం చేశారు.

చంద్రబాబు 29 సార్లు ఢిల్లీ వెళ్లింది తన అవినీతిని, దొంగతనాలను కప్పిపుచ్చుకోవడానికేనని విమర్శించారు. అధికారం కోసం ఎంతవరకైనా దిగజారే వ్యక్తి చంద్రబాబు అని, వెన్నపోటు పొడవడంలో, మోసాలు చేయడంలో ఆయనను మించిన సీనియర్‌ లేరని తెలిపారు. కులాలరహితంగా ఏకమై చంద్రబాబుపై పోరాటం చేయాలని, తగిన గుణపాఠం చెప్పాలని మోత్కుపల్లి పిలుపునిచ్చారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -