Saturday, April 20, 2024
- Advertisement -

అన్ని రెడ్లకేనా.. ప్రజలు ఊరుకోరు : ఎంపీ రఘురామ

- Advertisement -

వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణం రాజు మరోసారి సీఎం జగన్ ను టార్గెట్ చేశారు. ఖాళీ పోస్టు ఎక్కడ ఉన్నా సరే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారికే భర్తీ చేస్తున్నారని ఆరోపణలు చేశారు. క్రిస్టియన్ అయిన జగన్ అన్ని కులల వారిని సమానంగా చూడాలని అందుకే ఆయనకు ప్రజలు ఓట్లు వేశారని.. ఆ నమ్మకంను పొగొట్టుకోవద్దని సూచించారు. మరో 30 ఏళ్లు అధికారంలో ఉండాలంటే అందుకు తగ్గ పనులు చేయాలని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగి గుర్రంపాటి దేవేందర్ రెడ్డిపై రఘురామకృష్ణం రాజు తీవ్ర విమర్శలు చేశారు.

ఇతనో ప్రభుత్వ ఉద్యోగి. గతంలో యువజన శ్రామిక రైతు పార్టీలో ఉన్నాడు. అప్పుడు జీతం ఇచ్చారో లేదో తెలియదు. కులాభిమానంతో పని చేసి ఉండొచ్చు. ఆ రుణం తీర్చుకోవాలని డిజిటల్ మీడియా డైరెక్టర్ అని ప్రభుత్వం ఇప్పుడు పదవి ఇచ్చి ఉండవచ్చు. సోషల్ మీడియా వైసీపీ పార్టీ కో ఆర్డినేటర్ గా ఉన్న అతనికి నెలకు రూ.2లక్షలు జీతం,కారు ఇస్తున్నారు. అయితే ప్రభుత్వం నుంచి జీతం తీసుకునే వ్యక్తితో పార్టీకి పనిచేయించుకోవడమేంటి అని రఘు రామ ప్రశ్నించారు. అలానే గతంలో తనపై సోషల్ మీడియాలో గుర్రంపాటి చేసిన విమర్శలను రఘురామ గుర్తు చేశారు.

‘గోటితో పోయేదాన్ని గొడ్డలిదాకా తెచ్చుకున్నట్టు స్వపక్షంలో విపక్షమంటూ కొత్త పత్యానికి పరుగులు పెట్టి మాటతో సరిపెట్టుకునేదానికి వేటుదాకా తెచ్చుకున్న రాజుగారి విగ్గు ఊడినట్లేనా? విగ్గు ఊడిపోతే రేపటినుంచి ఎలా తిరుగుతారో?’ అంటూ తనపై విమర్శలు చేశారని అన్నారు. ఉద్యోగి అయిన దేవెందర్ రెడ్డి.. రెడ్డీ ఫీలింగ్ తో ఇలా తనపై విమర్శలు చేసి ఉండవచ్చని అన్నారు. పార్టీ వేరు, ప్రభుత్వం వేరు. ప్రభుత్వం జీతం తీసుకుని పార్టీకోసం వర్క్ చేయడం ఏంటని ప్రశ్నించారు. ఎక్కడో ఉన్న వారిని తెచ్చి పోస్టింగ్ లు ఇవ్వడం.. ఇలా అన్నింట్లోనూ రెడ్లను నియమించుకుంటూ పోతే ప్రజలు సహించరని హెచ్చరించారు. ఎలాంటి క్వాలిఫీకేషన్ లేని ప్రతి రెడ్డికి ఉద్యోగం ఇచ్చి ఇలా ఎంపీలపై అవాకులు చవాకులు పేలమంటారా అని ప్రశ్నించారు. ఇంకో 30 ఏళ్లు సీఎంగా ఉండాలంటే అందరిని సమానంగా చూడాల్సిన అవ్సరం ఉందని అన్నారు.

రాజధాని అంశంపై క్లారిటీ ఇచ్చిన కేంద్రం.. జగన్ కు గుడ్ న్యూస్..!

జగన్ కొట్టి మాట్లాడతారు.. షాకింగ్ కామెంట్స్ చేసిన పృథ్వీ..!

జగన్ హ్యాపీ ఫీల్ అయ్యే విషయం చెప్పిన చిరు, సురేష్ బాబు..!

జగన్ సర్కార్ కొత్త నిర్ణయం.. కరోనా రోగి వద్ద కాలింగ్‌ బెల్‌.. !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -