ఢిల్లీలో రఘురామకు ఊహించని షాక్.. చక్రం తిప్పిన జగన్..!

1598
MP Raghurama Krishnam Raju reply to Vijaya sai reddy
MP Raghurama Krishnam Raju reply to Vijaya sai reddy

నిన్నమొన్నటివరకు వైసీపీని సీఎం జగన్ ని ఎంపీ విజయసాయి రెడ్డిని లెక్కచేయకుండా విమర్శకు చేశారు ఎంపీ రఘురామకృష్ణం రాజు. కేంద్ర బలగాలతో తనకు వైసీపీ నుంచి రక్షణ కల్పించాలని.. వైసీపీ షోకాస్ నోటీస్ జారి అయ్యాక ఢిల్లీలోనే తేల్చుకుందామని.. తన ఆలోచనతో వైసీపీని ఇరుకునపెడుదామని బయలు దేరారు.

కానీ సీఎం జగన్ ఢిల్లీలో తన చక్రం తిప్పాడు. దాంతో సీన్ రివర్స్ తిరిగింది. ఇప్పుడు జగన్ అంటే గౌరవం అని.. తాను షోకాజ్ నోటీసులకు జవాబు ఇస్తానని సన్నాయి మాటలు మొదలు పెట్టారట రఘురామకృష్ణం. లోక సభలో వైసీపీ నాలుగో అతి పెద్ద పార్టీ. రాజ్యసభలో 6వ అతిపెద్ద పార్టీ. వైసీపీతో బీజీపీకి చాలా అవసరం ఉంది. అందుకే సీఎం జగన్ ఢిల్లీలో తన పలుకుబడి ఉపయోగించారు. వైసీపీపై ఫిర్యాదు చేయడానికి వచ్చిన రఘురామకృష్ణం రాజు కూ ఎవరూ పెద్దగా స్పందించకుండా ఊరట దక్కకుండా చక్రం తిప్పారట.

దాంతో వైసీపీతో వ్యవహారం కేంద్రంతోనే తేల్చుకుంటానని ఢిల్లీ వెళ్లిన రఘురామకృష్ణం రాజుకు అక్కడి వెళ్లాక పరిస్థితి అర్థమైందట.. జగన్ పై ఫిర్యాదు కోసం వచ్చారని తెలియగానే పార్లమెంట్ స్పీకర్ తో పాటు మిగతా కేంద్రమంత్రులు కూడా మొక్కుబడిగా స్పందించారు. దాంతో ఏం చేయాలో అర్దం కానీ ఎంపీ రఘురామకృష్ణం రాజు యూటర్న్ తీసుకున్నట్టు ఆయన మాటలను బట్టి తెలుస్తోంది. జగన్ అంటే తనకు గౌరవమని.. విజయ సాయిరెడ్డే అంతా చేశాడని నెప్పాన్ని సాయిరెడ్డిపై మోపి మాట మార్చేశాడు. వైసీపీ షోకాజ్ నోటీసుకు సమాధానం ఇస్తానని తెలిపారు.

వేదాద్రి రోడ్డు ప్రమాదంలో మృతులకు 5లక్షల ఎక్స్‌గ్రేషియా : సీఎం జగన్‌

ఏపీ నుంచి కొత్త రాజ్యసభ సభ్యులు వీరే..!

లోకేష్ పని అయిపోయిందా ? ఇక అరెస్టేనా ?

ఏపీ బడ్జెట్‌ ప్రధాన అంశాలు ఇవే.. ఏ రంగానికి ఎంతంటే ?

Loading...