లైవ్ లో చంద్రబాబుకి షాక్ ఇచ్చిన ఎంఆర్ఓ..!

918
MRO Shock to Chandrababu in Video Conference
MRO Shock to Chandrababu in Video Conference

ఏపీలో ఇళ్ల స్థలాల పంపినీ పై రచ్చ జరుగుతూనే ఉంది. పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ విషయంలో అవకతవకలు జరుగుతున్నాయని టీడీపీ నిరసన చేపట్టింది. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు ఇళ్ల స్థలాల విషయంలో వైసీపీ ప్రభుత్వ తీరుపై ఫైర్ అవుతున్నారు. పేదళకు ఇళ్ల స్థాలలు ఇస్తామని చెప్పు వైసీపీ నేతలు దోచుకుంటున్నారని ఆయన ఆరోపించారు. టీడీపీ నేతలతో చంద్రబాబు వీడియో కాన్పరెన్స్ లో ఆయన ఏపీ ప్రబుత్వ తీరుపై మండిపడ్డారు.

టీడీపీ హయాంలో గ్రామీణ ప్రాంతాల్లో రెండున్నర నుంచి మూడు సెంట్ల వరకు స్థలము ఇచ్చామని, పది లక్షల వరకు ఇళ్ళు కట్టించాము అని పేర్కొన్నారు చంద్రబాబు. కరోనాపై జాగ్రత్తలు తీసుకోకుండా రాజకీయ కక్షలు తీర్చుకుంటున్నారని విమర్శలు గుప్పించారు. నిరుపేద ప్రజలకు అన్యాయం చేస్తే టీడీపీ సహించదని తేల్చిచెప్పారు. ఇది ఇలా ఉంటే.. వీడియో కాన్పరెన్స్ లో చంద్రబాబుకు ఓ ఎం‍ఆర్‍ఓ షాక్ ఇచ్చారు.

ఓ స్థలం తన హయంలో ఇచ్చానని చెప్పిన చంద్రబాబు.. ఆ స్థలం పేదలకు అందకుండా ఎలా చేస్తారని అడిగాడు. అందుకు ఎంఆర్‍ఓ జవాబు ఇస్తూ.. పరిస్థితుల కారణంగా అది వేరే ఇతర వాటికి ఉపయోగించామని.. పైనుంచి వచ్చిన అర్డర్ ప్రకారమే ముందుకు వెళ్తున్నామని.. వారికి మరో చోట స్థలాలు కేటాయించామని చెప్పారు. అయితే అందుకు చంద్రబాబు మండిపడ్డారు. అధికారులు చెప్పారు కాబట్టి కక్ష సాధించుకుంటాం అంటే కరెక్ట్ కాదు. దయచేసి అర్దం చేసుకోవాలని చంద్రబాబు అన్నారు. కాసేపు ఇద్దరి మధ్య చర్చ ఆసక్తికరంగా జరిగింది. మీరు కూడా అందుకు సంబంధించిన వీడియోని చూడండి.

జగన్ ని అభినందించిన పవన్..!

మోకా భాస్కరరావు హత్య వెనుక కొల్లు హస్తం.. : ఎస్పీ రవీంద్రనాథ్‌

కొల్లు రవీంద్రను అరెస్ట్ పై స్పందించిన కొడాలి నాని

జగన్ నుంచి రోజా , విడదల రజిని లకు గుడ్ న్యూస్ ?

Loading...