Thursday, April 25, 2024
- Advertisement -

సీఎం జగన్ తో ముద్రగడ అత్యవసర భేటీ ?

- Advertisement -

ముద్రగడ తీసుకుని ఇటువంటి నిర్ణయం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్ని ఒక్క కుదుపు కుదుపుతోంది. కాపులను బీసీల్లో చేర్చాలని మాజీమంత్రి ముద్రగడ పద్మనాభం తన టిడిపి ప్రభుత్వంలో చేసునటువంటి హడావుడి అంతా ఇంతా కాదు. 2014 ఎన్నికలకు ముందు కాపులను బీసీలో చేర్చుతామని టీడీపీ అదినేత చంద్రబాబు హామీ ఇవ్వడంతో ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రిజర్వేషన్లు కల్పించాలని ముద్రగడ ఉద్యమం చేపట్టారు. ఈ క్రమంలో ఉద్యమాన్ని అణిచివేసేందుకు టిడిపి ప్రభుత్వం కఠినంగా వ్యవహరించిందనే ఆరోపణలు ఉన్నాయి.

కానీ కాపులను బీసీల్లో చేర్చే విషయంలో చొరవ తీసుకోవడం వంటి పరిణామాలు ఆ సామాజికవర్గాంలో టీడీపీపై ఆగ్రహం పెంచేలా చేసింది. అది గ్రహించి కాపు కార్పొరేషన్ పేరుతో పెద్దఎత్తున నిధులు విడుదల చేసిన ఆ పార్టీని ఆ సామాజిక వర్గం వారు పెద్దగా నమ్మలేదు నమ్మలేదు. అయితే ముద్రగడ రీసెంట్ గా తీసుకున్నటువంటి వ్యవహారాలు నిర్ణయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ముఖ్యంగా ముద్రగడ మీద రకరకాల ఆరోపణలు ఉన్నాయి. అందులో ముఖ్యమైనది ముద్రగడకు కాంగ్రెస్ కాకుండా ఇతర ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే కాపు రిజర్వేషన్ అనేది గుర్తొస్తాయనదే ముఖ్యంగా వినిపించే మాట. కాపు రిజర్వేషన్లు తొలగించి కాంగ్రెస్ పార్టీ నేతలే అతిపెద్ద తప్పు చేశారని వినిపిస్తూ ఉంటుంది.

అప్పట్లో ఉద్యమంలోకి అనేక నిర్ణయాలు తీసుకొచ్చినటువంటి ముద్రగడ ఒక్కసారిగా సైడ్ అయ్యారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకముందుకు చేసినటువంటి పాదయాత్ర లో కాపు రిజర్వేషన్లు కేంద్రం పరిధిలోనే ఉంటాయని.. తాను కార్పొరేషన్ ఏర్పాటు చేసే అదుకుంటానని మాత్రమే హామీ ఇచ్చారు. కాపు రిజర్వేషన్లపై ప్రభుత్వం స్పష్టమైన వైఖరితో ఉండటంతో మరో నాలుగేళ్లపాటు ఉద్యమాన్ని నడపలేమంటూ ముద్రగడ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. ముద్రగడ నిర్ణయం మీద తెలుగుదేశం పార్టీ నాయకుడు బొండా ఉమ మహేశ్వరావు చేసిన వ్యాఖ్యల్ని ఒకసారి పరిశీలిస్తే కాపు ఉద్యమం తీసుకున్నటువంటి మలుపులు ఏంటో అర్దం అవుతాయి.

కాపు రిజర్వేషన్ల కోసం పోరాటం చేయడానికి తాను 13 జిల్లాల్లో కాపు నాయకులతో సమావేశం ఏర్పాటు చేస్తానని ఆయన చెప్పారు. ముద్రగడ నిర్ణయం సరైనది కాదు అంటూనే ఆయన ఆ విధంగా అన్నారు. దీని బట్టి టీడీపీ కాపు రిజర్వేషన్ పోరాటాన్ని సాధించి జగన్ కి చుక్కలు చూపించాలనే ప్లాన్ వేస్తున్నట్లు తెలుస్తోంది. మరోపక్క జగన్ కూడా దీనికి గట్టి ఇంపాక్ట్ క్రియేట్ చేసే దిశలో ముందుకు వెళ్తున్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముద్రగడ కాపు రిజర్వేషన్ల గురించి ఎత్తకపోవడమే అన్నిటికంటే పెద్ద పాయింట్.

కొద్ది రోజుల క్రితం కాపు నేస్తం పేరుతో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అర్హులైన కాపు మహిళల బ్యాంక్ ఖాతాలో సొమ్ము జమ చేయడం జరిగింది. ఆ క్రెడిట్ ఆయనకు దక్కకుండా చేసేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని రంగంలోకి దిగి కాపు రిజర్వెషన్ అంశం మళ్లీ తెర మీదకు తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో ముద్రగడ కూడా జగన్ కు బహిరంగ లేఖ రాసి కాపులను బీసీల్లో చేర్చాలని కోరారు. ఇది ఇలా ఉంటే ఆకస్మాత్తుగా తాను కాపు ఉద్యమం నుంచి తప్పుకుంటున్నట్లు ముద్రగడ బహిరంగ లేఖ రాయడం చర్చనీయాంశమయింది. మరోవైపు ముద్రగడ కాపు రిజర్వేషన్ ఉద్యమం పేరిట విరాళాలు వసూలు చేసి దోచుకున్నారని ఆరోపణలు కూడా సొంత సామాజికవర్గం నుంచి రావడంతో ఆయన హర్ట్ అయ్యారని తెలుస్తోంది.

ఏపీలో అన్ని వర్గాలకు సామాజిక న్యాయం చేస్తానని చెబుతున్న వైఎస్ జగన్ సర్కార్ కేంద్రం ప్రకటించినటువంటీ అగ్రవర్ణల పేద రిజర్వేషన్లపై మాంత్రం ఇంతవరకు నోరు మెదపట్లేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే ఈ అంశంపై బీజేపీ నేతలు గవర్నర్ కు ఫిర్యాదు చేసిన ఫలితం రాలేదు. అయితే ఆగ్రవర్ణ రిజర్వేషణ్ల అమలులోప్రభుత్వం చేస్తున్న నిర్లక్ష్యం మరో ఉద్యమానికి తిరిగి ప్రాణం పోస్తుందన్న సూచనలు కనిపిస్తుండటంతో పావులు కదుపుటూ ఈ వ్యవహారాన్ని చలబరిచే దిశగా జగన్ ప్రయత్నాలు చేస్తున్నారని.. త్వరలోనే ముద్రగడ, జగన్మోహన్ రెడ్డిల మధ్య అత్యవసర భేటీ జరుగుతుందని కాపు రిజర్వేషన్ దగ్గరనుంచి అనేక విషయాల గురించి చర్చిస్తారని తెలుస్తోంది.

కరోనాతో చనిపోయినవారిపై మానవత్వం చాటిన జగన్..!

విడుదల రజని నిర్ణయానికి జగన్ కూడా ఆశ్చర్యపోయారు..?

ఏపీలో కరోనా పంజా.. ఒక్క రోజులో 43 మంది మృతి.. 1,916 మందికి పాజిటివ్..!

జగన్ టీంలోకి ఫైర్ బ్రాండ్ టీం.. ఇక టీడీపీకి చుక్కలే..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -