Friday, April 19, 2024
- Advertisement -

జనసేనలోకి చిరు.. తమ్ముడు క్లారిటీ ఇచ్చాడు..!

- Advertisement -

కెరీర్ మంచి పీక్స్ లో ఉన్నప్పుడే మెగాస్టార్ చిరంజీవి రాజకీయల్లోకి వచ్చి పి ఆర్ పి పెట్టారు. ఎంతో ఆశిస్తే.. అనుకున్న స్థాయిలో పిఆర్‍పి నిలవలేకపోయింది. దాంతో ఆయన తన పార్టీని కాంగ్రెస్ లో కలిపివేసి పూర్తిగా రాజకీయ సన్యాసం తీసుకున్నారు. ఆ పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించిన పవన్ అప్పట్లో అన్న చిరు పైనే విమర్శలు చేసిన విషయం తెలిసిందే.

అయితే పవన్ కళ్యాణ్ 2014లో జనసేన పార్టీ స్థాపించి రాజకీయాల్లో క్రియాశీలంగా ఉంటున్నారు. ఇక పవన్ కళ్యాణ్ చిన్న అన్నయ్య నాగబాబు కూడా జనసేన పార్టీలో ముఖ్య సభ్యులుగా కొనసాగుతున్నారు. గత ఎన్నికల్లో ఆయన జనసేన తరుపు నుంచి ఎమ్‍పిగా పోటీ చేసి ఓటమిని చూశారు. కాగా నాగబాబు కొన్నాళ్లుగా నా ఇష్టం పేరుతో ఓ యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించి.. అందులో మెగా కుటుంబ హీరోల సినిమాల గురించి.. జనసేన పార్టీ కార్యక్రమాల గురించి.. ఇతర పార్టీ విషయాల గురించి మాట్లాడుతూ ఉన్నారు.

అయితే తాజాగా చిరంజీవి జనసేన పార్టీలోకి వచ్చే ఆలోచన ఉందా ? అన్న ప్రశ్నకు నాగబాబు క్లారిటీ ఇచ్చారు. రాజకీయాల వైపు అన్నయ్య చిరంజీవి వెళ్లకూడదని నిర్ణయించుకున్నారు. ఆయన జనసేనలో చేరితే మళ్లీ రాజకీయాల్లోకి వచ్చినట్లే అవుతుంది. అందుకే ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటూ తన అనుభవం మరియి సేవా గుణం చిత్ర పరిశ్రమకు ఉపయోగించాలని అనుకుంటున్నారు. కాబట్టి చిరంజీవి జనసేనలో చేరడు అనేది నా గట్టి నమ్మకం. ఇక భవిష్యత్ ఎలా ఉంటుందో చెప్పలేం కాబట్టి ఆయన మనసు మారితే మారవొచ్చు అని నాగబాబు అన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -