టీడీపీకి కరెక్ట్ వ్యక్తి జగనే : నాగబాబు

571
Nagababu Comments YS Jagan And Chandrababu
Nagababu Comments YS Jagan And Chandrababu

జనసేన నాయకుడు మెగా బ్రదర్ నాగబాబు జగన్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రత్యర్ధి పార్టీలు అధికార పార్టీపై విమర్శలు చేయడం మామూలే గా అంటే మీరు పప్పులో కాలేసినట్లే. ఎందుకంటే నాగబాబు జగన్ గురించి పాజిటివ్ గా మాట్లాడారు. దీనిపై పూర్తి వివరాల్లోకి వెళితే.. మెగా బ్రదర్ నాగబాబు ఓ టీవీ ఛానల్ కిచ్చిన ఇంటర్వ్యూలో.. రాష్ట్ర రాజకీయాలతో పాటు సినిమా రంగంలో నెలకొన్న పరిస్థితులపై కూడా స్పందించారు.

ఈ సందర్భంగా జగన్ ను ప్రశంసలతో ముంచెత్తారు నాగబాబు. గత కొంతకాలంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో జర్నలిజం విలువలు పడిపోయాయి. దీనికి కారణం చంద్రబాబే అని ఆరోపించారు నాగబాబు. చంద్రబాబు తన స్వార్థ ప్రయోజనాల కోసం మీడియాను వాడుకోవడం మొదలు పెట్టారు. అది ఇప్పుడు పెద్ద వృక్షంలా తయారయిందని నాగబాబు వెల్లడించారు. బాబు గారు ఏం చేసినా సరే ఈ మీడియా ఆయనకు భజన చేస్తుంది అని మెగా బ్రదర్ చెప్పుకొచ్చారు. చంద్రబాబు ప్రయోజనాలను కాపాడే రక్షణ కవచాలుగా కొన్ని మీడియా సంస్థలు ఉన్నాయి అన్నారు.

వీటిని మనం ప్రస్తుతం యెల్లో మీడియాని పిలుస్తాను అని తెలిపారు ఆయన. తెలుగు వార్త ఛానల్స్ ని చూస్తుంటే ముచ్చటేస్తుంది. చంద్రబాబు ఉప్పు తిని టీడీపీ విశ్వాసం గా పనిచేస్తుంది ఈ యెల్లో మీడియా. ఇది వారి తప్పు కాదు వారిని ఇలా తయారు చేసిన వారి తప్పు అని పేర్కొన్నారు నాగబాబు. వీటన్నింటినీ చూస్తుంటే సీఎం జగనే వీరికి కరెక్ట్ అని చెప్పుకొచ్చారు. తప్పుడు వార్తలపై జగన్ ఉక్కు పాదము మోపుతున్నారని ఇలాంటి వారికి జగన్ లాంటి వ్యక్తి కరెక్ట్ అని తెలిపారు. జగన్ ఇలా చేయకపోతే వీరు మరింత రెచ్చిపోతారని నాగబాబు చెప్పారు. అయితే తన వ్యాఖ్యలకు పార్టీతో ఎటువంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు.

ఇది తన సొంతంగా చెబుతున్న మాటలు తన వ్యాఖ్యలతో జనసేన పార్టీకి ఎటువంటి సంబంధం లేదని చెప్పుకొచ్చారు. 2019 లో జరిగిన ఎన్నికల్లో జనసేన పార్టీ నుంచి నరసాపురం పార్లమెంట్ అభ్యర్థిగా నాగబాబు పోటీ చేశారు. వైసీపి అభ్యర్ధి రఘురామ కృష్ణంరాజుపై పోటీ చేసి ఓడిపోయారు నాగబాబు. మరి నాగబాబు వ్యాఖ్యలపై జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారో చూడాలి.

విశాఖ నుంచే పరిపాలన.. జగన్ ఫిక్స్..!

ఎందుకయ్యా చిట్టినాయుడూ.. గొడవలోకి మీ ఆవిడను లాగుతావ్ : విజయ సాయి

వైసీపీ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ : వైసీపీలోకి 5 ఎమ్మెల్సీలు జంప్

ఉచితంగా ఇసుక పంపిణీ : జగన్ సంచలన నిర్ణయం..!

Loading...