Friday, April 19, 2024
- Advertisement -

చ‌దువు ‘కొన్న’ లోకేష్‌ కితకితలు

- Advertisement -

ఏడాదిన్నర వైసీపీ పాలనలో 750 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని… రైతు రాజ్యం అంటే ఇదేనా? అని ప్రశ్నించారు టీడీపీ నేత నారా లోకేశ్. దెబ్బతిన్న పంటలకు కనీస మద్దతు ధరను ప్రకటించాలని… వరద ముంపుకు గురైన ప్రతి కుటుంబానికి రూ. 5 వేల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు నారా లోకేశ్.

వాస్తవానికి ఈ సంవ‌త్స‌రం (2020) జూన్ నుంచి సెప్టెంబ‌ర్ వ‌ర‌కు వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల వ‌ల్ల పంట న‌ష్ట‌పోయిన 1.66 ల‌క్ష‌ల మంది రైతుల‌కు రూ.135.73 కోట్ల పెట్టుబ‌డి సాయం నేరుగా వారి ఖాతాల్లో అక్టోబ‌ర్ 27,2020న జ‌మ చేసింది జ‌గ‌న్ ప్ర‌భుత్వం.

అక్టోబరులో జరిగిన పంట నష్టంపై అంచనాలు తయారవుతున్నాయి.. వీరికి నవంబర్‌లోపే రైతుల ఖాతాల్లోకి డబ్బు ఇవ్వడానికి చ‌ర్య‌లు చేప‌ట్టారు. రాష్ట్ర చ‌రిత్ర‌లో ఏ సీజ‌న్ పంట న‌ష్ట‌ప‌రిహారం అదే సీజ‌న్‌లో ఇంత వ‌ర‌కు ఎవ‌రూ ఇవ్వ‌లేదు. మొద‌టిసారి జ‌గ‌న్ ఇచ్చాడు.

గత చంద్ర‌బాబు పాల‌న చూస్తే ఘోరంగా ఉంది…
2014లో పంట నష్టం జరిగితే 2017 జనవరి వరకూ ఇవ్వలేదు
2015లో ఖరీఫ్‌లో నష్టం జరిగితే 2016 నవంబర్‌ లో ఇచ్చారు
2016 ఖరీఫ్‌ లో నష్టం జరిగితే 2017 జూన్‌లో ఇచ్చారు
2017 రబీలో నష్టం జరిగితే.. 2018 ఆగస్టులో ఇచ్చారు.
2018 ఖరీఫ్‌లో నష్టం జరిగితే పూర్తిగా ఎగ్గొట్టారు

మొత్తం 50.47 ల‌క్ష‌ల మంది రైతులు రైతు భ‌రోసా ద్వారా ల‌బ్ధి పొందుతున్నారు. రాష్ట్రంలో కోటిన్న‌ర కుటుంబాలుంటే ప్ర‌తి మూడు కుటుంబాల‌లో ఒక కుటుంబానికి రైతు భ‌రోసా సాయం అందుతోంది. ఈ ప‌థ‌కం కోసం ప్ర‌భుత్వం ఏడాదికి రూ. 6 ,797 కోట్లు వెచ్చిస్తోంది.

రాష్ట్రంలో ఉండే రైతుల రుణం మొత్తం రూ.87,600 కోట్లు మాఫీ చేస్తాం.. అని 2014లో ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చిన తరువాత కోటయ్య చౌదరి కమిటీ వేసి 24 వేల కోట్లకు కుదించి, ఐదేళ్ల లో కేవలం రూ.15వేలు కోట్లు చెల్లించాడు బాబు ఇవి వడ్డీ కు కూడా సరిపోలేదు.

జగన్ ను పొగుడుతున్న టీడీపీ ఎమెల్యే..

టీడీపీ చేతుల్లోంచి ఆ వర్గాన్ని తెలివిగా లాక్కున్న వైసీపీ..?

ఎన్ని కుప్పిగంతులు వేసిన జగన్ ముందు పనిచేయవు..?

చంద్రబాబు కు జగన్ అంటే ఎందుకింత అసూయా…!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -