Friday, March 29, 2024
- Advertisement -

ట్విట్టర్ పిట్ట వదిలి రావాలి చినబాబు

- Advertisement -

జనంమెచ్చిన నాయకుడిగా ఎదగాలంటే జనంలోనే ఉండాలి. ప్రతిపక్ష నాయకుడి ఉన్న సమయంలో వైఎస్ జగన్ అదే చేశారు. అసెంబ్లీ ఉపన్యాసాలకు కూడా దూరంగా ప్రజాక్షేత్రంలోనే ఉన్నారు. దాదాపు మూడేళ్లపాటు 3వేల కి.మీలకు పైగా జనంలో తిరిగారు. వారి బాధలు విన్నారు. ఇప్పుడు ప్రజాదరణతో సీఎం అయ్యారు. అంతేకానీ.. ట్విట్టర్, ఫేస్ బుక్ వంటి సామాజిక మాధ్యమాలను జగన్ వాడలేదు.. దాని ద్వారా పిలుపులు ఇవ్వలేదు. అంతా జనంలోకి వెళ్లి ముక్కుసూటిగా తను అనుకున్నది చెప్పారు.

నాయకుడి లక్షణం అదే.. జనంలో ఉన్నవారినే గెలిపిస్తారు. కానీ మన లోకేషం బాబు ఇంకా ట్విట్టర్ గూట్లోనే ఉండి చిలకపలుకుల అస్త్రాలు విసురుతున్నారు. వినడానికి, చూడడానికి బాగానే ఉన్నా ఆ పలుకులు జనాలకు చేరెదెన్నడు..? ఆయనను పాపులర్ అయ్యేది ఎన్నడూ..? నిజానికి జనాలకు ఈ ట్విట్టర్ లు, ఫేస్ బుక్ లు ఉండవు. టీవీల్లో వస్తే చూస్తారు. జనం మధ్యలోకి వచ్చిన నేతలను ఆదరిస్తారు. ఇప్పుడు ఈ రెండింటికి టీడీపీ ప్రధాన కార్యదర్శి నారాలోకేష్ బహుదూరంగా ఉండడం గమనార్హం.

నారా లోకేష్ భాషా తడబాటుతో ఆయన జనంలోకి వచ్చినప్పుడు అభాసుపాలవుతున్నారు. ఆయన పలికే తప్పుడు మాటలు వైరల్ అయ్యి టీడీపీ పరువు తీస్తున్నాయని సొంత పార్టీ నేతలే ఆడిపోసుకుంటున్నారు.. ఇక నాయకత్వ లోపాలు బోలెడు. అందుకే మంగళగిరిలో తొలిసారి పోటీచేసి గెలవలేకపోయారని విమర్శలు వచ్చాయి.. ఇప్పుడు ఈయన టీడీపీ భవిష్యత్ లీడర్ గా ఎవరికీ కనిపించడం లేదని మొన్ననే కాపు నేతలు కుండబద్దలు కొట్టారు.

అయితే బయట కనిపించని.. వినపించని లోకేష్ వాయిస్ ట్విట్టర్ లో మాత్రం యమగట్టిగా ప్రత్యర్థులకు తగులుతోంది. ట్వీట్స్ తో లోకేష్ జగన్ ను, వైసీపీ ప్రభుత్వాన్ని చెడుగుడు ఆడేస్తున్నారు. ఆయన రాస్తున్నారో.. ఎవరైనా హ్యాండిల్ చేస్తున్నారో కానీ పదునైన విమర్శలు కాకరేపుతున్నాయి.

కానీ ట్విట్టర్ లో లోకేష్ కు ప్రజాదరణ రాదని.. జగన్ లా ఆయన జనంలో ఉండాలని.. ఆయన బయటకు వస్తేనే ఎదుగుతారని రాజకీయ విశ్లేషకులు ఘంటా పథంగా చెబుతున్నారు. ప్రజల మద్దతు కూడగట్టుకోవాలంటే క్షేత్రస్థాయిలో పోరాటాల ద్వారానే సాధ్యమంటున్నారు. జగన్ ఎప్పుడు అంత యాక్టివ్ గా ట్విట్టర్ చేయరు. ఏదైనా శుభాకాంక్షలు ఇతర అత్యవసరానికే వాడుతారు. ప్రజల్లోనే తిరగడం.. మాట్లాడడం ఆయనకు అలవాటు.. లోకేష్ దీనికి విరుద్ధంగా ఇంకా ట్విట్టర్ లోనే ఉంటూ కాలం గడుపుతున్నారు. ఇప్పటికైనా ప్రజా నాయకుడిగా ఎదగాలనుకుంటున్న లోకేష్ బాబు మేల్కొని ప్రజాక్షేత్రంలోకి వస్తేనే మనుగడ అని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -