Saturday, April 20, 2024
- Advertisement -

లోకేష్ విష‌యంలో కొత్త స్టెప్ తీసుకున్న బాబు…

- Advertisement -

ఏపీ మాజీ సీఎం చంద్ర‌బాబు ప్ర‌స్తుతం గ‌డ్డు ప‌రిస్థితులు ఎదుర్కొంటున్నారు. అధికార పార్టీ నుంచి వ‌చ్చే ఇబ్బందుల కంటె సొంత ఇంటినుంచే తీవ్వ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అది కూడా రాజ‌కీయ వార‌సుడు పుత్ర‌ర‌త్నం లోకేష్‌. రాజ‌కీయ వార‌సుడిగా ఎదుగుతాడ‌ని దొడ్డి దారిన మంత్రిని చేసినా చిన‌బాబులో మాత్రం మార్పు రావ‌డంలేదు. గ‌తంలో అంటె అధికారంలో ఉన్న‌ప్పుడు ఏది మాట్లాడినా అది చెల్లుతుంది. కాని ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడ కూడా అదే పంథా కొన‌సాగిస్తుండ‌టంతో పార్టీ ప‌రువు గంగ‌లో క‌ల‌సి పోతోంది.

బాబుకు అతి పెద్ద మైన‌స్ కొడుకు లోకేష్‌. బాబు రాజ‌కీయ వ్యూహాలు ఒక్క‌టి కూడా లోకేష్‌కు నేర్చుకోవ‌డంలేదు. మంత్రిగా రెండేళ్ళ పాటు ట్రైనింగ్ ఇచ్చినా కూడా రాజకీయం ఒంట‌బ‌ట్ట‌లేదు. ల‌క్ష‌లు పోసి ట్రైనింగ్ ఇచ్చినా చిన‌బాబులో మాత్రం రాజ‌కీయ ప‌రిజ్ణానం శూన్యం. అయితే లోకేష్ ట్విట్ట‌ర్‌లో చేస్తున్న పిచ్చి పిచ్చి కామెంట్స్ వ‌ల్ల పార్టీ ప‌రువుపోతోంది.

జగన్ని ఓ మాట అనబోయి నాలుగు మాటలు తనకూ, తండ్రికీ కూడా అంటించుకుంటున్నాడని తమ్ముళ్ళు గొల్లుమంటున్నారు. తాజా ఎన్నికల్లో వైసీపీ 151 అసెంబ్లీ సీట్లను గెలుచుకుని రికార్డ్ స్రుష్టించింది. కోట్లాది ప్ర‌జ‌లు జ‌గ‌న్‌కు ప‌ట్టం క‌ట్టారంటె అర్థం చేసుకోవ‌చ్చు. అలాంట‌ప్పుడు విజ్ణ‌త‌గా వ్య‌వ‌హ‌రించ‌కుండా ఇష్ట‌మొచ్చిన‌ట్లు కామెంట్లు చేస్తున్నారు.

కొత్త ప్ర‌భుత్వానికి కొంత వ్య‌వ‌ధి ఇవ్వాలి. అలాంటిది ప్ర‌భుత్వం ఏర్ప‌డి నెల‌దాటింది అంత లోనె జ‌గ‌న్‌పై ట్విట్ట‌ర్‌లో విమ‌ర్శ‌లు ఎక్కుపెట్టారు. పార్టీనేత‌ల‌కంటె లోకేష్ చేస్తున్న కామెంట్ల వ‌ల్ల పార్టీ కి మ‌రింత డ్యామేజ్ జ‌ర‌గుతోంద‌ని తెలుగు త‌మ్ముళ్లు ఆందోళ‌న‌లో ఉన్నారంట‌.

జగన్ మీద కోర్టులో కేసులున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్కటి కూడా రుజువు కాలేదు. కోర్టు తీర్పు ఇవ్వ‌కుండానె ఏ1, ఏ2 అని లోకేష్ అనడం ద్వారా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని, తీర్పుని కూడా కించపరుస్తున్నారని అంటున్నారు.

మ‌రో వైపు లోకేష్ నాయ‌క‌త్వాన్ని మెజారిటీ నేత‌లు వ్య‌తిరేకిస్తున్నారు. ప్ర‌ధానంగా కాపునేత‌లు ఈ విష‌యంలో ముందున్నారు. తాజాగా కాపు నేత‌ల‌తో బాబు భేటీ అయ్యారు. పార్టీలో లోకేష్ మితిమీరి జోక్యం చేసుకున్న కారణంగానే నేతల్లో తీవ్ర అసంతృప్తి పెరిగిపోయినట్లు చెప్పారట.లోకేష్ తో పాటు లోకేష్ చుట్టుఉన్న నేతలపైన కూడా కాపు నేతలు తీవ్రమైన ఆరోపణలే చేశారట. దీంతో లోకేష్‌తో ప‌నిలేద‌ని ఏదైనా ఉంటె నేరుగా నాతోనే మాట్లాడాల‌ని సెల‌విచ్చారంట బాబుగారు కాపునేత‌ల‌కు. ఇలాంటి ఒక కొడుకు చాలు పార్టీని నాశ‌నం చేయ‌డానిక‌ని అంటూ నేత‌లు మాట్లాడుకుంటున్నారంట‌.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -