షాకింగ్ః చంద్రబాబును ఛీ కొడుతున్న జాతీయ మీడియా

389
National Media Focus on AP CM Chandrababu
National Media Focus on AP CM Chandrababu

జాతీయ స్థాయిలో చక్రం తిప్పుతా…… నాకంటే దేశంలో సీనియర్ నాయకుడు ఎవరూ లేరు అని డప్పాలు కొట్టుకునే చంద్రబాబుకు షాక్. ఇప్పుడు జాతీయ స్థాయిలో ప్రజలు, నేషనల్ మీడియా కలిసి చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. టెర్రరిస్టుల ఎటాక్‌ని మోడీనే చేయించి ఉంటాడు. టెర్రరిస్టుల ఎటాక్‌తో సంబంధం లేదని పాకిస్తాన్ చెప్పిందని….పాకిస్తాన్ వాదన సరైనదేనని, మోడీనే దాడులు చేయించి ఉంటాడు అని మోడీపై కోపంతో ఇష్టారీతిన చంద్రబాబు వ్యాఖ్యలు చేసినట్టుగా ఈనాడు, ఆంధ్రజ్యోతితో పాటు పచ్చ మీడియా అంతా వార్తలు కుమ్మేసింది. అయితే ఇప్పుడీ వార్తలే చంద్రబాబు జాతీయ కలలకు చెక్ పెడుతున్నాయి.

ఈ రోజుల్లో ఏ సమాచారం అయినా చాలా ఫాస్ట్‌గా రీచ్ అవుతుంది కదా…….అలానే జాతీయ మీడియా కూడా ఇప్పుడు చంద్రబాబు మాటలను ఏకిపడేస్తోంది. అన్నింటికీ మించి జాతీయ స్థాయిలో ప్రజలందరూ కూడా చంద్రబాబుపై విరుచుకుపడుతున్నారు. చంద్రబాబు, మమతా బెనర్జీలాంటి వాళ్ళను పాకిస్తాన్ పంపించెయ్యాలని తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇక తెలుగు నాట అయితే ఎన్టీఆర్‌కి వెన్నుపోటు పొడిచి సిఎం అయిన చంద్రబాబు……….ఆ తర్వాత కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌కి వెన్నుపోటు పొడిచాడని……ఇప్పుడిక పాకిస్తాన్‌కి, తీవ్రవాదులకు సపోర్ట్ చేస్తూ ఏకంగా భారతదేశానికే వెన్నుపోటు పొడవాడినికి రెడీ అయిపోతున్నాడని తెలుగు ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక మీడియా చేపట్టిన చర్చలో పాల్గొన్న విజయవాడ ప్రజలే చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడం టిడిపి నేతల్లో కూడా ఆందోళన పెంచుతోంది. అందుకే పాకిస్తాన్‌ని సమర్థించిన చంద్రబాబు మాటలను ఎలా కవర్ చేయాలో తెలియక తిప్పలు పడుతున్నారు. ఏది ఏమైనా అధికారం కోసం, రాజకీయం కోసం చంద్రబాబు ఎంతకైనా దిగజారుతారన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.