Friday, April 19, 2024
- Advertisement -

పాతపాటే పాడిన మోడీ, కేసీఆర్ మోసం బట్టబయలు

- Advertisement -

అంతా ఊహించినట్లే ఎన్డీఏ ప్రభుత్వం సునాయాసంగా సంఖ్యాబలాన్ని నిరూపించుకుంది. అవిశ్వాస తీర్మానంపై 12 గంటల పాటు జరిగిన చర్చ అనంతరం ఓటింగ్ నిర్వహించారు. అందులో అవిశ్వాసానికి అనుకూలంగా 126 ఓట్లు, వ్యతిరేకంగా 325 ఓట్లు పడ్డాయి. శివసేన, బీజేడీ, టీఆర్ఎస్ పార్టీలు ఓటింగ్ లో పాల్గొనలేదు. కానీ ఏపీ ప్రత్యేకహోదా, పోలవరం, విశాఖ రైల్వో జోన్, కడప ఉక్కు ఫ్యాక్టరీ, వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజ్ సహా విభజన హామీల అమలులో మోడీ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని టీడీపీ ఎంపీలు కడిగిపారేశారు. అవిశ్వాసంపై చర్చ ప్రారంభించిన టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ మిష్టర్ ప్రైమ్ మినిస్టర్ అంటూ మోడీనే టార్గెట్ చేస్తూ, ఇంగ్లిష్ లో ఏపీ సమస్యలను ఏకధాటిగా దంచేశారు. మధ్యాహ్నం నుంచి మొదలైన చర్చలో శ్రీకాకుళం టీడీపీ ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు హిందీలో మోడీ, అరుణ్ జైట్లీ, రాజ్ నాథ్ సింగ్ దుమ్ము దులిపేశారు. ఏపీ విషయంలో వివిధ సందర్భాల్లో వాళ్లు చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ మోడీని దేశం ముందు దోషిగా నిలబెట్టారు.

భరత్ అనే నేను సినిమా డైలాగులని ఉదహరిస్తూ, మిష్టర్ ప్రైమ్మినిస్టర్..అని సంబోధిస్తూ గల్లా జయదేవ్ సుమారు గంట సేపు మోడీ మొండి వైఖరిని, ఏపీకి చేస్తున్న అన్యాయాన్ని ఎండగట్టడం హైలెట్ గా నిలిచింది. అడ్డగోలు విభజనతో ఏపీ ఎంత నష్టపోయిందో. ప్రత్యేకహోదా ఆవశ్యకత ఏంటో విడమరిచి మరీ చెప్పారు. ఇప్పటికైనా న్యాయం చేయాలని కోరారు. అవినీతిని అంతమొందిస్తా…అని చెప్పుకొచ్చిన మోడీ గాలి జనార్ధన్ రెడ్డితో చేతులు కలిపి కర్నాటక ఎన్నికల్లో పోటీ చేయడంపై ఏం సమాధానం చెబుతారని నిలదీశారు రాహూల్ గాంధీ సైతం మోడీ తీరుని ఎండగట్టారు. దేశ సంపదకు కాపలదారుగా ఉంటానని చెప్పిన మోడీ దోపీడీ దొంగలతో వాటాదారుగా మారిపోయారని విమర్శించారు. ఏపీికి జరిగిన అన్యాయంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ విషయంలో బీజేపీ పాతపాటే పాడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మోడీ మాత్రం ఏపీ అభివృద్ధికి సాయపడతాం. అనే పాత డైలాగే మళ్లీ మళ్లీ చెప్పి ఆంధ్రాలో బీజేపీ మరింత పాతాళంలోకి పాతేసేలా చేసుకున్నారు. ప్రత్యేకహోదా ఊసెత్తకుండా, పరనింద ఆత్మస్తుతి అన్నచందంగా మోడీ పాత పాటే పాడారు. ఇప్పటికే మోడీ మాటలు, బీజేపీ చేతలపై రగిలిపోతున్న ఆంధ్రుల గుండెల్లో మరింత కసి రాజేశాలా మోడీ మాట్లాడేరే తప్ప. వారి గుండె మంటలను చల్లార్చే హోదా గురించి మాట్లాడకుండా తన అహంకార ధోరణి ప్రదర్శించారు. ఈ చర్చతో పూర్తిగా ఏపీలో బీజేపీకి ఆయనే సమాధి కట్టేసినట్టయింది.

శివసేన, టీఆర్ఎస్ మాటాడితే బీజేపీని విమర్శిస్తూ, బీజేపీయేతర పార్టీలతో వెళ్తామని చెప్పే కపటనాటకాలు ఓటింగ్ సందర్భంగా బట్టబయలయ్యాయి. ఏపీకి హోదా ఇవ్వాల్సిందే అని పదే పదే చెప్పుకొచ్చిన టీఆర్ఎస్ అదే విషయంపై అవిశ్వాసం పెట్టినప్పుడు మాత్రం చల్లగా జారుకుంది. దీంతోనే ఆ పార్టీ మోసపూరిత వైఖరి మరోసారి తేటతెల్లమైంది. దీంతో వచ్చే ఎన్నికల్లో హైదరాబాద్ సహా తెలంగాణ అంతటా ఉన్న ఆంధ్రుల ఓట్లుపై కేసీఆర్ ఆశలు వదుకోవాల్సిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -