Wednesday, April 17, 2024
- Advertisement -

వైసీపీ మరో లీడర్ లో అసంతృప్తి.. పెరిగిపోతుందా..?

- Advertisement -

2018  ఎన్నికల్లో  ప్రజల తీర్పు తో ఎంతో ఘన విజయం సాధించి వైసీపీ పీఠమెక్కినా సంగతి తెలిసిందే.. గత ప్రభుత్వం హయాంలో జరిగిన అవినీతి, అన్యాయాల దృష్ట్యా ప్రజలు జగన్ కి ఉన్న పాపులారిటీ తో ఆయనపై నమ్మకం ఉంచారు.. ఆ తర్వాత జరుగుతున్న రాజకీయ పరిణామాలు అందరికి తెలిసందే.. రాజధాని తరలింపు అంశం రాష్ట్రంలో ప్రధానాంశంగా ఇప్పుడు తయారైంది. ప్రతిపక్షాలు దీన్ని తీవ్రం గా తప్పుబడుతున్న జగన్ మాత్రం అనుకున్నది సాధించి తీరారు..  త్వరలోనే విశాఖ కు లాంఛనంగా రాజధాని షిఫ్ట్ అయిపోతుంది. అంతా బాగుందన్న టైం లో వైసీపీ పార్టీ లో నేతలకు అసంతృప్తి రోజు రోజు కి పెరిగిపోతుంది..

ప్రభుత్వం అన్నాకా అందరిని ఎమ్మెల్యేలను మెప్పించడం చాలా కష్టం.. చాల సమీకరణాల దృష్ట్యా ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వడం, వారికి తగ్గ పదవులు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో పార్టీ కోసం కష్టపడినా వారిలో కొంతమందికి అనుకున్న పదవులు, ఉన్నత స్థానాన్ని కల్పించడం కుదరకపోవచ్చు.. అందుకే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తన మంత్రి వర్గ విస్తరణం ను రెండు భాగాలుగా చీల్చి రెండున్నరేళ్ళకోసారి మంత్రి వర్గ విస్తరణ చేయాలనీ నిర్ణయించారు.. ఈ నేపథ్యంలో మొదటి మంత్రి వర్గ విస్తరణలో చాలామంది కి మొండి చేయి చూపాల్సి వచ్చింది.. రోజా వంటి కీలక మైన మహిళా నేతలకు ఎలాంటి పదవులు ఇవ్వకుండానే జగన్ సరిపుచ్చాడు..

ఈ నేపథ్యంలో పార్లమెంటు సభ్యుడు ఆదాల ప్రభాకర్ రెడ్డి కూడా పార్టీ పై ఎందుకో అసంతృప్తి ని చుపిస్తున్నాడట..గత కొంతకాలంగా ఆయన జిల్లాను కూడా పట్టించుకోవడం లేదు. ఆయన కరోనాకు భయపడే నెల్లూరుకు రావడం లేదన్న టాక్ వినపడుతుంది. ఆంధ్రప్రదేశ్ లో కేసులు ఎక్కువగా ఉండటం, తాను వస్తే ప్రజలు తనను కలిసేందుకు పెద్ద సంఖ్యలో వస్తారని భావించి ఆదాల ప్రభాకర్ రెడ్డి హైదరాబాద్ లోనే ఎక్కువగా ఉంటున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. కానీ అసలు అది కాదని తెలుస్తుంది.. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆదాల ప్రభాకర్ రెడ్డి కి తనకు కాకుండా వేరే వారికి కాంట్రాక్టులు వెళ్లిపోవడం ఆయనను బాధించింది..అంతేకాదు వివిధ ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం టెండర్లను ఆహ్వానిస్తుంది. అయినా ఆదాల ప్రభాకర్ రెడ్డి చలించడం లేదంటే ఆయన పార్టీ పై ఎంత అసహనంగా ఉన్నారో అర్థమవుతుంది.. 

జగన్, చంద్రబాబు పోటీ పడి మరీ మోడీ కి జై కొడితే ఎలా..?

గంటా గురి మంత్రి పదవికే..!

జగన్ ఢిల్లీ టూర్ కి వెళ్లి ఏం సాధించుకోచ్చారు..?

రాజు గారు ఇప్పుడెలా మరీ…!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -