Saturday, April 20, 2024
- Advertisement -

మహిళా ఉద్యోగినిపై దాడి చేసిన సహ ఉద్యోగి..!

- Advertisement -

ఇప్పుడు కరోనా వైరస్ భీభత్సంగా వ్యాపిస్తున్న క్రమంలో రోజు రోజుకి కేసులు దారుణంగా పేరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరు మాస్క్ పెట్టుకోవడం తప్పనిసరి అయింది. అయితే మాస్క్ పెట్టుకోవాలని ఓ అధికారికి అక్కడ పని చేస్తున్న మరో ఉద్యోగి సూచించింది. దాంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఆ అధికారి మహిళ అని చూడకుండా ఆమెపై దాడి చేశాడు. ఈ దృశ్యాలు సీసీ ఫుటేజ్ లో రికార్డ్ కావడంతో అతనిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.

ఈ ఘటన నెల్లూరు ఏపీ టూరిజం ఆఫీసులో చోటు చేసుకుంది. అక్కడ పనిచేస్తున్న డిప్యూటీ మేనేజర్ భాస్కర్ రావు ముఖానికి మాస్క్ పెట్టుకోకుండా ఆఫీస్ కి వచ్చాడు. దీంతో అక్కడ వర్క్ చేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగిని ఉషారాణి .. ముఖానికి మాస్క్ పెట్టుకోవాలని భాస్కర్ రావుకు సూచించింది. దాంతో ఆగ్రహం చెందిన భాస్కర్ రావు.. దివ్యాంగురలైన ఉషారాణిపై విచక్షణా రహితంగా దాడికి దిగాడు. మహిళ అని చూడకుండా ఆమెను దారుణంగా కొట్టాడు. అక్కడ ఉన్న ఉద్యోగులు అడ్డుకున్నప్పటికి.. అతడు వాళ్లను పక్కకు తోసేశాడు. అయితే భాస్కర్ రావుకు, ఉషారాణికి మధ్య గతంలో ఎలాంటి గొడవలు లేవు.

దీనిపై స్పందించి పై అధికారులు విచారణకు ఆదేశించారు. కలెక్టర్ సైతం ఆరోజు కార్యాలయంలో ఏం జరిగిందన్న దానిపై పూర్తి నివేదిక ఇవ్వాలని కోరారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలన్ని అక్కడున్న సీసీ ఫుటేజ్ లో రికార్డ్ అయ్యాయి. దాంతో కేసు నమోదు చేసిన పోలీసులు భాస్కర్ రావును అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటనపై ఏపీ టూరిజం శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు కూడా స్పందించారు. బాధితురాలు ఉషారాణితో ఆయన ఫోన్లో మాట్లాడారు. భాస్కర్ రావును శాశ్వతంగా విధుల నుంచి తొలిగిస్తామని హామీ ఇచ్చారు.

https://www.youtube.com/watch?v=_zF6RQSmLhQ

పవన్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన రాపాక వరప్రసాద్

బ్రేకింగ్ : మచిలీపట్నంలో వైసీపీ నేత దారుణ హత్య..!

టీడీపీకి కరెక్ట్ వ్యక్తి జగనే : నాగబాబు

ఢిల్లీలో రఘురామకు ఊహించని షాక్.. చక్రం తిప్పిన జగన్..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -