Tuesday, April 16, 2024
- Advertisement -

అప్పుడు ప్రతీకారం.. ఇప్పుడు భజన.. ఏదైనా బాబు..బాబే..!

- Advertisement -

ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ కి ఉన్న బలం సంగతి అందరికి తెలిసిందే.. ఆ తరువాత టీడీపీ కి కొంత బలం వుంది.. ఆ తర్వాత బీజేపీ కి ఇంకొంత బలం వుంది.. మిగితా పార్టీ లకు ఎంతో కొంత ఉందని చెప్పొచ్చు.. అయితే గత కొన్ని రోజులుగా  బీజేపీ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో బలపడుతున్న తీరు చూస్తుంటే వచ్చే ఎన్నికలనాటికి టీడీపీ ని మట్టి కరిపించేలా కనిపిస్తుంది.  అందుకే టీడీపీ పార్టీ ఇప్పటినుంచే బీజేపీ కి మోకరిల్లుతుంది.. సమయం వచ్చినప్పుడల్లా చంద్రబాబు బీజేపీ కి దగ్గరయ్యి తన స్థానాన్ని పదిలం చేసుకోవాలని చూస్తున్నాడు..

మొన్నటి ఎన్నికల్లో మోడీ ని దేశంలో ఏ నాయకుడు ఎక్కువగా విమర్శించాడు అంటే చంద్రబాబు అనిచెప్పాలి.. ఆంధ్ర కు రావాల్సిన ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ ని పూర్తి విలన్ గా చేసి చంద్రబాబు ఆడిన మైండ్ గేమ్ కు మోడీ దిమ్మ తిరిగిపోయిందనడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు.. చివరికి మోడీ తన మాటే నెగ్గించుకుని జగన్ సపోర్ట్ చేసి చంద్రబాబు ను అధికారంలోకి రానివ్వకుండా చేశాడు.. ఇంకేముంది జగన్ కూడా బీజేపీ తో ఇప్పుడప్పుడే వైరం ఎందుకని జగన్ కూడా బీజేపీ కి మద్దతు ఇస్తూనే వస్తున్నాడు.. అప్పుడప్పుడు మీటింగ్స్, భేటీలు వంటి వాటితో రాష్ట్రంలో మిగిలిపోయిన కొన్ని పనులను చేయించుకుంటున్నారు..

ఇప్పుడు మోడీ భజన చేస్తున్న చంద్రబాబు గతంలో మోడీపై చేసిన చాలా విమర్శలను వెనక్కి తీసుకుని వాటిని పొగడ్తగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు.. రాఫెల్ విదేశీ యుద్ధ విమానాలను చేర్చుకోవడం భారతదేశానికి గర్వకారణమని, భారత దేశాన్ని ఇది శక్తివంతమైన దేశంగా మార్చిందని చంద్రబాబు చేసిన ట్వీట్ పై నెటిజన్ల నుండి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత ఏడాది ఫిబ్రవరిలో ఇదే అంశంపై ట్వీట్ చేస్తూ దేశంలోనే ఇది అతిపెద్ద స్కాం అంటూ చంద్రబాబు చేసిన ట్వీట్ ను ఆయనకు గుర్తు చేస్తూ నెటిజన్లు బాబు మాట మార్చారు అంటూ విమర్శిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -