Friday, March 29, 2024
- Advertisement -

ప‌గ‌వాడికి కూడా లోకేష్‌లాంటి ప‌రిస్థితి రాకూడ‌దు…

- Advertisement -

ఏపీ ఐటీ మంత్రి నారాలోకేష్ ట్విట్ట‌ర్‌లో ఏది పోస్ట్ చేసినా క్ష‌నాల్లో నెటిజ‌న్ల‌కు దొర‌కిపోవ‌డం ..వారు చెడుగుడు ఆడుకోవ‌డం అల‌వాటుగా మారింది. మూడేళ్లు మంత్రిగా ప‌నిచేసిన లోకేష్ ఇప్పుడు ప్ర‌త్య‌క్ష‌రాజ‌కీయాల్లో త‌న అద్రుష్టాన్ని ప‌రీక్షించుకోబోతున్నారు. ఇప్ప‌టికే గ‌తంలో అనేక సార్లు చిన‌బాబును చెడుగుడు ఆడుకున్న లోకేష్ మ‌రో సారి బుక్ అయ్యాడు. హోలీ పండుగ రోజునే లోకేష్ నెటిజ‌న్లు ఆడేసుకుంటున్నారు. హోళీ రోజు రసాయన రంగులు హాని చేస్తాయని, సహజరంగులు ఆనందాన్ని ఇస్తాయని ట్విటర్‌లో సూచించారు. హోలీ పండుగను సహజ రంగులతో సురక్షితంగా జరుపుకోవాలని కోరారు. అంత వ‌ర‌కు బాగానే ఉంది కాని … చిన‌బాబు ఇక్క‌డే మ‌రో సారి ప‌ప్పులో కాలేశారు. పసుపు సహజమైన రంగు. మీ భవిష్యత్తుకు శుభాన్నిస్తుంది అని పేర్కొన్నారు. అంతే ఇంకేముంది నెటిజ‌న్లు లోకేష్‌ను తెగ ట్రోల్ చేస్తున్నారు.

హోలీ శుభాకాంక్షల వరకు బాగానే ఉన్నా…పసుపురంగుతో ముడిపెట్టి రాజకీయ రంగుపులమడమేంటని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.మోసపూరిత వాగ్ధానాలతో 2014లో అధికారంలోకొచ్చింది టీడీపీనే అంటూ మండిపడ్డారు. ట్విటర్‌లో యమా యాక్టివ్‌గా ఉండే లోకేశ్‌ గతంలో చేసిన ఓ ట్వీట్‌ను వెలికి తీసి మరీ ఓ ఆట ఆడుకుంటున్నారు.

https://twitter.com/naralokesh/status/687307571774894080

’12 ఏళ్లలో టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌లు కలిసి హైదరబాద్‌లో మెట్రోరైలు కట్టలేకపోయారు. టీడీపీ ప్రభుత్వం మాత్రం 2018 డిసెంబర్‌నాటికి విజయవాడ మెట్రో పూర్తి చేస్తుంది’ అంటూ 2016లో లోకేశ్‌ ట్వీట్‌ చేశారు. 2018 ముగిసి 2019 కూడా ప్రారంభమైంది. అయినా కూడా విజ‌య‌వాడంలో మెట్రోకు సంబంధించి ఒక్క అడుగు కూడా ముందుకు ప‌డ‌లేదు. టీడీపీ మోసపూరిత వాగ్ధానాలపై సెటైర్లు వేయడానికి నెటిజన్లకు దొరికిన ఓ మంచి అవకాశంగా మారింది. దీంతో సామాజిక మాధ్యమాల్లోనే లోకేశ్‌తో నెటిజన్లు హోలీ ఆడుకుంటున్నారు.

https://twitter.com/naralokesh/status/687307571774894080

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -