Saturday, April 20, 2024
- Advertisement -

నారా బ్రాహ్మణికి ఊహించని షాక్ ఇచ్చిన సీఎం జగన్..!

- Advertisement -

ఏపీ పాలిటిక్స్ కథ వేరు. ఇతర ప్రాంతాల రాజకీయాలతో వీటిని పోల్చలేము. ఎవరి వ్యాపారాలు వాళ్ళవి. ఎవరు వ్యాపకాలు వాళ్ళవి. కేవలం రాజకీయంగానే ప్రత్యర్థులం అనే ధోరణి సరిపోదు ఇక్కడ. ప్రత్యర్ధిని ఆర్థికంగా రాజకీయంగా మానసికంగా సామాజికంగా దెబ్బతీయాలనేదే ఇక్కడ చలామణి. జగన్ అధికారంలోకి రాగానే చంద్రబాబును అష్టదిగ్బంధనం చేసే ప్రక్రియ ప్రారంభమైంది. అందులో ముఖ్యమైనది తన ఆర్థిక స్తంభాలను డిస్టర్బ్ చేయడం.

నవయువ దగ్గర నుండి స్టార్ట్.. మొన్నమొన్నటి గల్లా జేయదేవ్ భూమి వాపస్ తీసుకునేదాకా.. అది అలా కొనసాగుతూనే ఉంటుంది. పైపైన కొమ్మలు కొట్టడం కాదు రూట్స్ నే టార్గెట్ చేయడం. తనకు సహకరించే వారి సంగతి సరే మరి చంద్రబాబు సొంత వ్యాపారం.. అవును దానికి స్పాట్ పెట్టే ప్రయత్నాలు.. నా జేబులో పెన్ను ఉండదు.. రూపాయి బిల్లా ఉండదు.. చేతికి వాచీ ఉండదు.. ఏదో పాలు కూరగాయలు అమ్ముకుంటాం అని చంద్రబాబు పైకి ఎన్ని పేద మాటలు చెప్పినా తన సొంత సంస్థ హెరిటేజ్ వేల కోట్ల రూపాయల ఎంపైర్.. తాను అధికారంలో ఉన్నప్పుడు దాని షేర్ గ్రాఫ్ ఎప్పుడు పైపైకే.

హెరిటేజ్ లాభాల కోసం ఏకంగా చంద్రబాబు సహకార డైరీలను దెబ్బతీశారనే ఆరోపణలు ఉన్నాయి. కానీ ఇప్పుడు కదా రివర్స్. ఆ హెరిటేజ్‍లను టార్గెట్ చేయాలంటే సహకార డైరీలను మళ్లీ మొదలు పెట్టడం. ఆ పాడి రైతులకు ప్రోత్సాహకాలు ఇవ్వడం ఒక పద్దతి. కానీ మ్యాథ్స్ లోకి చేరిన అవి కాస్త బాగున్నాయి తప్ప మిగతావి సంస్థాగతంగా వీక్. చంద్రబాబు హయాంలో అవి మరింత దెబ్బ తిన్నాయి. అందుకని ఇప్పుడు ఏకంగా అమూల్ రంగంలోకి వస్తుంది. పేరుకు అది సహకార రంగంలోని డైరీనే. కానీ ఇతర కార్పొరేట్ డైరీలకు తాత అది. నాణ్యత మార్కెటింగ్ పద్ధతుల్లో దూకుడు. తాజాగా అమూల్తో ఏపీ ప్రభుత్వం ఓ అవగాహన ఒప్పందాన్ని అధికారికంగా కుదుర్చుకుంది. మార్కెట్లో బోలేడు ప్రైవేటు డైరీలు ఉన్నాయి.

ఈ అమూల్ వచ్చి ఏం చేస్తుంది పైగా హెరిటేజ్ కు కూడా స్ట్రాంగ్ రూట్స్ ఉన్నాయి. కమిటెడ్ మిల్క్ సప్లైయర్స్ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బ్రాంచెస్ స్టోర్స్ ఉన్నాయి. అమూల్ ను ఎదుర్కోవడం కూడా పెద్ద కథేమీ కాదు అనే వాళ్ళు ఉన్నారు. కానీ అమూల్ కు నేరుగా ప్రభుత్వ సహకారం ఉంటుంది. సహకార రంగానికి వర్తింపజేసే అన్ని రకల ప్రోత్సాహకాలను గనుక జగన్ ప్రభుత్వం అమూల్ కూడా వర్తింపజేస్తే హెరిటేజ్ కు పెద్ద దెబ్బే అవుతుంది. చికాకు పడటమే కాదు అమూల్ తో ఓ పెద్ద పోరాటమే చేయాల్సి ఉంటుంది. ప్రొఫెషనల్గా అమూల్ కూడా ఒకసారి ఏపీ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చిందంటే బలంగా పాతుకుపోయి ప్రయత్నాలు ఎలాగో చేస్తుంది కదా.

గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు వేరు.. కానీ ఇప్పుడు వ్యాపారపరంగా బలంగా పోటీపడాలి హెరిటేజ్. చంద్రబాబు లోకేష్ రాజకీయాల్లోనే బిజీ. భువనేశ్వరి పేరుకు హెరిటేజ్ పదవిలో ఉన్నా.. ఎక్కువ వర్క్ చేసేది లోకేష్ భార్య బ్రాహ్మణి. ప్రసిద్ధ అమెరికన్ లో మేనేజ్ మెంట్ గ్రాడ్యుయేట్ ఆమె. వ్యాపార నిర్వహణలో మంచి పేరు సంపాదించింది. సో అమూల్ తనకు పరీక్ష ఎప్పుడు. గతంలో హెరిటేజ్ రిటైల్ ను పూచర్ గ్రూప్స్ కి అమ్మేసుకున్నారు. ఈ మేరకు ఆ కంపెనీ షేర్లను పొందారు. హెరిటేజ్ ఫ్రెష్ మాత్రం చంద్రబాబు కుటుంబమే నడిపించుకుంటుంది. ఇక ఇప్పుడు అమూల్ రాకతో ఏపీలో ఓ భారీ ఫైట్ అనమాట.

గంటా శ్రీనివాస్ రావు నిర్ణయంతో సీఎం జగన్ హ్యాపీ ?

విజయసాయిరెడ్డికి కరోనా పాజిటివ్..!

రోజాకు సీఎం జగన్ గూడ్ న్యూస్.. ఏంటంటే ?

మంత్రి సుచరిత ఘోర అవమానం.. ఏం జరిగింది ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -