వైఎస్సార్‌ చేయూత.. మహిళలకు జగన్ సర్కార్ శుభవార్త..!

839
new scheme launches in ap
new scheme launches in ap

జగన్ సర్కార్ మహిళలకు మరో పథకానికి శ్రీకారం చుట్టింది. వైఎప్సార్ చేయూత పథకాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. సీఎం క్యాంపు ఆఫీస్ లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా.. మొదటి విడత సాయంగా బటన్ నొక్కి నేరుగా లబ్దిదారుల అకౌంట్లోకి రూ.18,750లు జమచేశారు. ఈ పథకం 45 నుంచి 60 ఏళ్ల మధ్య ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల్లో అర్హత ఉన్న మహిళలకు వర్తిస్తుంది.

ఏటా రూ.18,750 చొప్పున నాలుగేళ్ల కాలంలో రూ. 75,000 లను మహిళలకు జగన్ సర్కార్ అందజేయనుంది. అక్కచెల్లెమ్మల జీవితాల్లో వెలుగు నింపేందుకు వైఎస్సార్‌ చేయూత పథకాన్ని తెచ్చామని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. వైఎస్సార్‌ చేయూతను ప్రారంభించడం తన అదృష్టమని.. 45 నుంచి 60 ఏళ్ల మహిళలకు ఏ పథకం లేదని.. వైఎస్ఆర్ చేయూత ద్వారా వారి కుటుంబాలకు మంచి జరగాలి అని ఆకాక్షించారు. మహిళలకు తోడుగా ఉంటాం.. వారి అకౌంట్ లోకి రూ.18,750 జమ చేస్తున్నాం.. నాలుగేళ్లలో రూ.75వేల ఆర్థిక సహాయం అందజేస్తామని అన్నారు. దాదాపు 25 లక్షల మంది మహిళలకు లబ్ది చేకూరుంది.

మహిళలకు వ్యాపార అవకాశాలు కల్పిస్తామని సీఎం జగన్ అన్నారు. ఈ పథకం కింద 5 లక్షల మంది అకౌంట్లలోకి డబ్బులు జమ చేస్తారు. మహిళల్లో ఆర్థిక సుస్థిరత, తద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ప్రగతికి తోడ్పాటును అందించేలా ఈ పథకాన్ని రూపొందించారు. రాష్ట్ర బడ్జెట్‌లో వైఎస్సార్‌ చేయూత పథకానికి రూ.4,700కోట్లు కేటాయించారు. గతంలో ఏ ప్రభుత్వం అందించని విధంగా దాదాపు 25లక్షల మంది మహిళలు ఈ పథకం ద్వారా 4 ఏళ్లలో రూ.17 వేల కోట్లు అందజేయనున్నారు.

శంకుస్థాపన వాయిదా.. వెనుకడుగు వేసిన జగన్.. ఎందుకు ?

పవన్ కళ్యాణ్ కు వెన్నుపోటు.. ఎవరి నుంచో తెలుసా ?

ఫ్యాన్స్ : ప్రభాస్ డైలాగ్ తో దుమ్ములేపుతున్న జగన్..!

జగన్ కోరిక మేరకు దిగివచ్చిన మోడీ.. ఫ్యాన్స్ కు పండగే..!

Loading...