Thursday, April 25, 2024
- Advertisement -

ఆపరేషన్ ఏపీ, తెలంగాణలో బీజేపీ పెద్ద ట్విస్ట్

- Advertisement -

కేంద్రంలో రెండోసారి ఏకపక్షంగా అఖండ మెజార్టీ సాధించిన బీజేపీకి ఇప్పుడు ఏ మిత్రుడు అవసరం లేదు. బీజేపీ పెద్దలను ఎదురించే శక్తి ఏ పార్టీకి లేకుండా పోయింది. కాంగ్రెస్ 52 సీట్లతో ప్రతిపక్ష హోదాను కాపాడుకోలేకపోయింది. దీదీ లాంటి పశ్చిమబెంగాల్ పులులు ఫలితాల తర్వాత మౌనం దాల్చారు.

ఇక ఫెడరల్ ఫ్రంట్ కేసీఆర్ రిజల్ట్స్ తర్వాత బీజేపీ దూకుడును జాగ్రత్తగా గమనిస్తున్నారు. అయితే బీజేపీ మాత్రం ఆపరేషన్ తెలుగు రాష్ట్రాలను దిగ్విజయంగా మొదలు పెడుతోంది. తాజాగా కీలక పరిణామాలు రెండు రాష్ట్రాల్లో చోటుచేసుకోవడం చర్చనీయాంశంగా మారింది.

ఏపీ గవర్నర్ గా పొరుగునే ఉన్న మహారాష్ట్ర బీజేపీ వాది న్యాయవాది, రచయిత హరిచంద్ ను కేంద్రం నియమించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఏపీలో టీడీపీని లేకుండా చేసి ఆ ప్లేసులోకి బీజేపీ వచ్చి అధికార వైసీపీతో ఢీకొనాలని స్కెచ్ గీస్తోంది. అందుకే అనుయాయు అయిన బీజేపీ ఆర్ఎస్ఎస్ వాదిని ఏపీ గవర్నర్ గా నియమించడంతో ఏపీలో బీజేపీ ప్రత్యర్థులకు డేంజర్ బెల్స్ మోగినట్టే కనిపిస్తోంది.

ఇక తెలంగాణలోనూ బిగ్ ఫిష్ లను పట్టేశారన్న టాక్ వినిపిస్తోంది. తెలంగాణ ఎన్నికల్లో కూలబడ్డ కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ బలమైన జంట కొండా దంపతులకు బీజేపీ వేసిన గాలం ఫలించిందట.. వారు త్వరలోనే బీజేపీలో చేరడానికి నిర్ణయించుకున్నట్టు సమాచారం. కొండా బీజేపీలో చేరితే వరంగల్ జిల్లా ఆ పార్టీకి కొత్త శక్తి తెలంగాణలోనూ బలం చేకూరుతుంది.

ఇలా రెండు రాష్ట్రాల్లో కీలకమైన వ్యవహారాలు నడుపుతూ బీజేపీ వేస్తున్న ప్లాన్లు చర్చనీయాంశంగా మారుతున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -