Saturday, April 20, 2024
- Advertisement -

వైసీపీ తలనొప్పిగా మారిన కోర్టు ల వ్యవహారం..!!

- Advertisement -

ఏపీ రాష్ట్రంలో మరో ప్రతిపక్షం గా తయారైన నిమ్మగడ్డ ప్రసాద్ తాజాగా మరో కొత్త తలనొప్పిని తెరమీదకు తీసుకువచ్చారు.. గతంలో ఇలాగే ప్రభుత్వం పై కోర్టు కెక్కి కాలయాపన చేసి ప్రభుత్వం టైం ని వేస్ట్ చేసిన నిమ్మగడ్డ ఇప్పుడు మరో సమస్య తో ముందుకు వచ్చి రచ్చ చేయాలనీ చూస్తున్నాడు.. కరోనా సమయంలో ఎన్నికలు నిర్వహించవద్దని పట్టుపట్టి మరీ ప్రభుత్వాన్ని ఎదురించి కేసు గెలిచినా నిమ్మగడ్డ కు ఆ విజయం కొంత తలకెక్కినట్లుంది.. దాంతో తనేం చేసినా చెల్లుతుందని ఇష్టం వచ్చినల్టు చేస్తూ పోతున్నాడు.. దాని వైసీపీ అడ్డుకుంటుందని మళ్ళీ తోకజాడించే ఆలోచన చేస్తున్నాడు..

గతంలో ప్రభుత్వ వ్యతిరేఖ పనులు చేస్తూ ఎన్నికల కమిషనర్ గా తొలగించబడ్డ నిమ్మగడ్డ కోర్టు లో దాదాపు నాలుగు నెలలు పోరాడి తిరిగి ఆ పదవిని పొందాడు.. పదవిలోకి చేరగానే ప్రభుత్వం పై కక్షయ్ గట్టినట్లు వ్యవహరించడం వైసీపీ వర్గాల్లో కొంత ఆందోళన కలిగించింది.. నిమ్మగడ్డ తో పటు బీజేపీ, టీడీపీ పార్టీ ల నేతలు టచ్ లో ఉండి ఇదంతా చేస్తున్నారని అందరికి తెలిసినా ఎన్నికల కమిషనర్ పారదర్శకంగా ఉండాలనే కనీస అవగాహనా ఆయనకు లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది.. ప్రభ్టువం పై విమర్శలు చేస్తే పాపులారిటీ వస్తుందనే ఆలోచన తో అయన ఇలా చేస్తున్నాడని అర్థమయిపోతుంది. ఇక దానికి తోడు కోర్టు ల్లో కేసులు పెడితే కేంద్రంలో కూడా తన పేరు వినపడుతుందని కేంద్ర పెద్దల మెప్పుకోసం అయన ఇదంతా చేస్తున్నాడని క్లియర్ గా తెలిసిపోతుంది.

తాజాగా ఆయన మరోసారి కోర్టుకెకెక్కారు.. తాను పదవి చేపట్టిన దగ్గరినుంచి ప్రతి నిర్ణయాల్లో వైసీపీ పార్టీ అడ్డొస్తుందని, రాష్ట్ర ఎన్నికల కమిషన్ సిబ్బందిని ప్రభుత్వం వేధిస్తుందని, ఎన్నికల కమిషన్ విధుల్లో ప్రభుత్వం జోక్యం చేసుకుంటుందని నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు.దీంతో భవిష్యత్ లో అయన తీసుకునే నిర్ణయాలకు ఎలాంటి ఇబ్బంది రాకూడదని ఇప్పటినుంచే ప్రణాళిక వేసుకుంటున్నలు తెలుస్తుంది. నిజానికి ఇప్పుడికిప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం లేదు. ఎందుకంటే కరోనా వైరస్ ఏపీలో ఎక్కువగా ఉంది. రోజుకు పదివేల కేసులకు పైగానే నమోదవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఎన్నికల నిర్వహణపై ఆయన నిర్ణయం తీసుకునే ఛాన్స్ లేదు.అంతే కాకుండా గత స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా తలెత్తిన శాంతిభద్రతల సమస్య పరిస్థిితిపై కూడా నిమ్మగడ్డ రమేష్ కుమార్ జిల్లా పోలీసు అధికారులో సమీక్షించేందుకు సిద్ధమవుతున్నారని చెబుతున్నారు. అందుకే ముందుగా హైకోర్టును ఆశ్రయించి జిల్లా కలెక్టర్, ఎస్పీలకు కూడా ఒక సంకేతం పంపాలన్నది ఆయన ఆలోచనగా తెలుస్తోంది.  పదవిలోకి వచ్చిన ఓ నెలరోజులు సైలెంట్ గా తనపని తాను చేసుకుపోయిన నిమ్మగడ్డ ఇలా తిరగబడడం పై మళ్ళీ వైసీపీ నేతలు అతను ఏం చేశాడో అని కొంత తలలు పట్టుకుంటున్నారట.. ఇక ఇటీవలే నిమ్మగడ్డ ఆంధ్రప్రదేశ్ పాలనపై కేంద్ర హోమ్ శాఖా కు రాసిన లెటర్ టీడీపీ ఆఫీస్ లో రాయబడింది అని వార్తలు రాగ దీనిపై ఆయనపై సీఐడీ విచారన్న చేస్తుంది.. అది మనసులో పెట్టుకుని అయన ఈ పనులు చేస్తున్నారని అధికార ప్రభుత్వం ఆరోపిస్తుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -