Friday, April 19, 2024
- Advertisement -

హుజూర్ నగర్ మరో నిజామా‘బాధ’ కానుందా?

- Advertisement -

టీఆర్ఎస్ సర్కారు తమకు న్యాయం చేయడం లేదని ఆగ్రహించిన నిజామాబాద్ రైతులు సీఎం కేసీఆర్ కూతురు కవితపై నిజామాబాద్ లో పోటీచేశారు. ఏకంగా 170మందికి పైగా పోటీచేసి కవితకు చుక్కలు చూపించారు. బీజేపీ అభ్యర్థి గెలుపులో కవిత ఓటమిలో కీలకంగా వ్యవహరించారు. ఇప్పుడు ఈ నిజామా‘బాధ’.. హుజూర్ నగర్ లోనూ పునారవృతం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

హుజూర్ నగర్ లో సోమవారంతో నామినేషన్ల దాఖలు గడువు ముగిసింది. సోమవారం నామినేషన్ల ఆఖరు నాటికి ఇక్కడ 119మంది అభ్యర్థులు బరిలోకి దిగి నామినేషన్లు దాఖలు చేశారు. దీంతో మరోసారి హుజూర్ నగర్ ఉప ఎన్నిక పోరు అందరి దృష్టిలో పడింది.

అధికార టీఆర్ఎస్ నుంచి మొన్నటి ఎన్నికల్లో ఓడిన సైదిరెడ్డి మరోసారి ఈ ఉప ఎన్నికల్లో నిలబడగా.. కాంగ్రెస్ నుంచి పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య పద్మావతి నామినేషన్ వేశారు. ఇక టీడీపీ నుంచి కిరణ్మయి, బీజేపీ అభ్యర్థిగా రామారావు ప్రధాన పార్టీల నుంచి బరిలోకి దిగారు.

ఇటీవల 30 రోజుల ప్రణాళిక, హరితహారంలో సర్పంచ్ లను బాధ్యులుగా చేయడం సస్సెండ్ చేయడం.. వారి సమస్యలను టీఆర్ఎస్ సర్కారు తీర్చకపోవడంతో సర్పంచ్ లు పోరుబాట పట్టారు. ఈ క్రమంలోనే హుజూర్ నగర్ లో చాలా మంది నామినేషన్లు వేసి ప్రభుత్వానికి తమ నిరసనను ఇలా తెలియజేశారు. దీంతో ప్రస్తుతం హుజూర్ నగర్ లో భారీ పోటీ నెలకొంది. ఈ పరిణామం అధికార టీఆర్ఎస్ కు ఇబ్బంది కరంగా మారింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -