Friday, April 26, 2024
- Advertisement -

ముఖ్యమంత్రి జగన్ ప్లేస్ లో ఎన్టీఆర్.. ఇదేక్కడి రచ్చా ?

- Advertisement -

అందరు ఊహించినట్లే గత ఎన్నికల్లో వైసీపీ అద్భుతమైన విజయం సొంతం చేసుకుంది. ఇక వైసీపీ అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు అవుతుంది. కానీ ఏపీ రాజకీయాల్లో మాత్రం వేడి తగ్గాలేదు. ఇక వైసీపీ పాలనలో చాలా మార్పులు చేసి.. తమ పార్టీని ప్రజల్లోకి మరింత దగ్గరగా తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది.

అయితే అధికారంలోకి ఏ పార్టీ వచ్చిన ప్రభుత్వ భవనలకు, ఇతర ప్రభుత్వ ఆస్తులకు సంబంధించి వేటికైన తమ పార్టీ రంగులు వేయించడం మాములే. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇలానే తమ పార్టీ రంగు అయినటువంటి పసుపు రంగు ను వేయించారు. ఇప్పుడు వైసీపీ అధికారంలో ఉంది కాబట్టి ప్రభుత్వ ఆస్తులకు తమ పార్టీ రంగులైన తెలుపు, ఆకుపచ్చ రంగులు వేయించుకుంటుంది. అయితే కృష్ణా జిల్లా గంపలగూడెం మండలం దుందిరాలపాడు గ్రామ సచివాలయానికి కూడా ఇటీవలే వైసీపీ తమ పార్టీ రంగులను వేయించించి.

అయితే ఇది నచ్చని గ్రామానికి చెందిన కొందరు టీడీపీ కార్యకర్తలు ఆ భవనానికి మరలా పసుపు రంగు వేయించడమే కాకుండా.. భవనంపై ఉన్న ముఖ్యమంత్రి జగన్ ఫోటో తీసేసి నందమూరి జూ ఎన్టీఆర్ ఫోస్టర్ ను తగిలించారు. అయితే ప్రభ్యుత్వ ఆస్తులను భంగపరచడమే కాకుండా.. సీఎం స్థాయిని కించపరిచిన నేపథ్యంలో గ్రామంలోని 17 మంది టీడీపీ కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేసి విచార జరుపుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -