Friday, March 29, 2024
- Advertisement -

అనంత‌పురంలో టీడీపీకీ భారీ షాక్‌.. పార్టీని వీడ‌నున్న ఎమ్మెల్యే

- Advertisement -

ఎన్నిక‌ల స‌మ‌యంలో టీడీపీకీ ఏమైందో గాని ఆ పార్టీని నేత‌లు ఒక్క‌క్క‌రుగా వీడుతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు, సీనియ‌ర్ నాయ‌కులు, మాజీ మంత్రులు అనే తేడా లేకుండా పార్టీకి గుడ్‌బాయ్ చెబుతున్నారు. పార్టీని మ‌రో సారి అధికారంలోకి రావాల‌ని బాబునానా తంటాలు, కుయిక్తులు పుడుతుంటే..బాబు నైజాన్నిగ‌మ‌నించిన నేత‌లు మాత్రం హ్యాండ్ ఇస్తున్నారు.

అమంచి, తోటా త్రిమూర్త‌లు, అవంతి బాట‌లో మ‌రో మాజా మంత్రి ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి.టీడీపీలో మంత్రిగా ప‌నిచేసిన ప‌ల్లెర‌ఘునాథ్ త్వ‌ర‌లో వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. దీంతో అనంత‌పురంలో ఆ పార్టీకి కోలుకోలేని దెబ్బ‌. గ‌తంలో మంత్రిగా ఓవెలుగు వెలిగిన మంత్రి అవ‌మాన‌క‌ర రీతిలో మంత్రి ప‌ద‌వినుంచి తొల‌గించారు బాబు. అప్ప‌టినుంచి ప‌ల్లె పార్టీకార్య‌క్ర‌మాల‌కు దూరంగా ఉంటున్నారు.

అస‌లు విష‌యానికి వస్తే మ‌రో సారి ఎన్నిక‌ల్లో పోటీ చేసేందుకు సిద్దంగా లేర‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే మంత్రిగా ప‌నిచేసిన ఆయ‌న రాజ్య‌సభ స‌భ్యునిగా వెల్లాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారంట‌. అదే విష‌యాన్ని బాబు ద‌గ్గ‌ర ప్ర‌స్తావిస్తే రాజ్యసభ సభ్యత్వం పట్ల చంద్రబాబు భరోసా ఇవ్వడంలేదని తెలుస్తోంది. ఇలా టీడీపీలో ఉండి అవ‌మానాలు ఎదుర్కొనే దానికంటే పార్టీనుంచి వైదొల‌గ‌డ‌మే మంచిద‌ని భావిస్తున్నారంట‌. ఆయ న వైసీపీ నేత‌ల‌తో సంప్ర‌దింపులు జ‌రిపిన‌ట్లు స‌మాచారం. రాజ్య‌స‌భ సీటుపై జ‌గ‌న్ నుంచి హామి వ‌స్తే వెంట‌నే పార్టీలో చేరేందుకు సిద్దంగా ఉన్నారంట‌.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -