Thursday, April 25, 2024
- Advertisement -

ఆ మృగాళ్లకు దారుణ శిక్ష విధించాలి : పవన్ కళ్యాణ్

- Advertisement -

వెటర్నరీ వైద్యురాలు ప్రియాంక రెడ్డి హత్య దేశం మొత్తాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఆమెపై కృరంగా అత్యాచారం చేసి హతమార్చిన నింధితులకు ఉరి శిక్ష వేయాలని ధర్నలు చేస్తున్నారు. సినీ, రాజకీయ సెలబ్రెటీలు సైతం ఈ విషయంపై తీవ్ర స్థాయిలో మండి పడుతున్నారు. ప్రియాంక రెడ్డిని దారుణంగా హతమార్చిన ఘటనపై జనసేన అధ్యక్షులు, నటులు పవన్ కళ్యాణ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

ఆడవాళ్ల గురించి స్టేజీలెక్కి లేక్కలేనని ఉపన్యాసాలు ఇవ్వడం కాదు.. వారి రక్షణ బాధ్యతలు కూడా తీసుకోవాలని అన్నారు. ప్రియాంక హత్యోదంతం తనను తీవ్రంగ కలచివేసిందని పవన్ కళ్యాణ్ అన్నారు. నోరు లేని మూగజీవాలకు చికిత్స చేసే ఆమె.. మానవ మృగాలకు బలైపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ’యత్ర నార్యేస్తూ పూజ్యంతే.. రమంతే తత్ర దేవతా’ అని మాట్లాడుకోవడానికి.. రాసుకోవడానికే తప్ప ఆచరణలోకి తీసుకురావడం లేదు.

ఇటీవలే కాలంలో చిన్నారులు, వృద్దులపై కామాంధుల లైంగిక దాడులు, అత్యాచారాలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లాలో చిన్నారిని ఓ దుర్మార్గుడు చిదిమేశాడు. హనుమకొండలో తొమ్మిదేళ్ల చిన్నారిపై అత్యాచారం జరిగింది. వరంగల్‌లో ఇంటర్నీడియట్‌ విద్యార్థినిపై ఓ కామాంధుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఇలాంటి వారికి కఠిన చర్యలు తీసుకోకపోవడం వల్లే వీరంత రెచ్చిపోతున్నారని అన్నారు. నిర్భయ చట్టం తీసుకొచ్చిన ఇలాంటి జరుగుతునే ఉన్నాయి.

ఆడబిడ్డలపై అత్యాచారాలకు పాల్పపడి, హత్యలు చేసే వారికి దారుణమైన శిక్షలు విధించాలని.. ఆ శిక్షలు చూస్తే మరోసారి ఇలాంటి దారుణాలకు పాల్పపడాలంటే భయపడిపోవాలని అన్నారు. సింగపూర్‌లాంటి దేశాల్లో ఇలాంటి శిక్షలు అమల్లో ఉన్నాయి. శివారు ప్రాంతాల్లో పెట్రోలింగ్‌, పర్యవేక్షణ పెంచాలి. అంతేకాదు విద్యార్థినులు, యువతల్లో ఆత్మస్థైర్యం పెంచడంతో పాటు ప్రాణ రక్షణ కోసం వారికి మార్షల్‌ ఆర్ట్స్‌ నేర్పించాలి అని పవన్ కళ్యాణ్ అన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -