Friday, March 29, 2024
- Advertisement -

గాజువాక‌లో ప‌వ‌న్ గెలుపు క‌ష్ట‌మేనా..?

- Advertisement -

న‌టుడు, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ మొద‌టిసారి ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల్లో పోటీ చేశారు. ప‌వ‌న్ 2014లోనే జ‌న‌సేన పార్టీ పెట్టిన‌ప్ప‌టికి ఆ ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌కుండా టీడీపీ పార్టీకి మ‌ద్ద‌తునిచ్చారు. ఆ త‌రువాత టీడీపీతో విభేదించిన ఆయ‌న సొంతంగా పోటీ చేశారు ప‌వ‌న్ క‌ల్యాణ్. అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గాజువాక, భీమవరం రెండు అసెంబ్లీ స్థానాలలో పోటీ చేసిన సంగతి అందరికి తెలిసిందే. రెండు చోట్ల కూడా కాపు ఓట్లు ఎక్కువుగా ఉండ‌టంతో ప‌వ‌న్ రెండు చోట్ల గెలుస్తార‌ని ధీమా వ్య‌క్తం చేశాయి ఆ పార్టీ వ‌ర్గాలు.

అయితే ప‌వ‌న్‌కు గెలుపు అంత ఈజీ కాద‌ని అంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు. గాజువాక‌లో ప‌వ‌న్‌కు వ్య‌తిరేక గాలి వీచింద‌ని వారు అంటున్నారు. పవన్ గాజువాకలో ఖచ్చితంగా ఓడిపోతారని, హైద‌రాబాద్ నుంచి వ‌చ్చి కోస్తా జిల్లాల్లో పోటీచేస్తుండ‌టమే పవన్ ఓటమికి పెద్ద కారణమని తెలుస్తోంది. ప‌వ‌న్ గెలిచిన అక్క‌డ ఉండ‌ర‌ని, ప్ర‌జ‌ల‌కు ఏది అయిన స‌మ‌స్య వ‌స్తే ఎవ‌రిని క‌ల‌వాలో తెలియ‌ద‌ని , అందుకే ప‌వ‌న్‌కు వ్య‌తిరేకంగా వారి కుల‌స్థులే ప‌ని చేశార‌ని అంటున్నారు.

దీనిలో భాగంగానే ప్రజలందరూ స్థానికులకే పట్టం కట్టారని సినిమా స్టార్ అయినా లోకల్ స్టార్‌ల ముందు ఓటమి పాలవడం ఖాయమని ప్ర‌త్య‌ర్థి పార్టీ నాయ‌కులు చెబుతున్నారు. మ‌రి ప‌వ‌న్ గాజువాక‌లో గెలుస్తారా? లేదా అనేది ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చే వ‌రకు వేచి చూడాల్సిందే.

https://www.youtube.com/watch?v=LI1YDFRCkBU

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -