Friday, April 19, 2024
- Advertisement -

పవన్ పార్ట్ టైం పొలిటిషన్ వేషాలు ఎన్నాళ్ళు.!!

- Advertisement -

2014 లో జనసేన పార్టీ పెట్టి టీడీపీ కి మద్దతిచ్చి ఆ తర్వాత సినిమాలు చేసుకున్నారు పవన్ కళ్యాణ్.. 2019 ఎన్నికల్లో డైరెక్ట్ గా పాల్గొని ఒక్క సీటు ను దక్కించుకు ఘోర పరాభవం పాలైన పవన్ ఇక పూర్తి స్థాయి రాజకీయాల్లో ఉండి ప్రజాసేవ చేస్తారనుకున్నారు. జన సైనికులు కూడా పవన్ సినిమాలు మానేస్తున్నానని చెప్పడంతో అయన ఇక రాజకీయాలకే అంకితం అని అనుకునాన్రు.. కానీ పవన్ కళ్యాణ్ ఇప్పుడు మళ్ళీ సినిమా బాట పట్టడంతో వారికి గొంతులు అరటిపండు అడ్డుకున్నట్లు అయ్యింది.. పవన్ మళ్ళీ సినిమాలు చేయడం వారికి ససేమీరా నచ్చట్లేదని తెలుస్తుంది.. నిత్యం రాజకీయంగా యాక్టివ్ గా ఉంటూ ప్రతిపక్షంలో గట్టి గళాన్ని వినిపిస్తూ అధికారపార్టీ ను విమర్శించి ప్రజల్లో ఉనికిని చాటుకునేది పోయి మళ్ళీ సినిమా లు చేస్తే రాజకీయంగా పవన్ కి ఒరిగేదేంటి అని వారి వాదన..

నిన్న పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు కాగా అయన చేయబోతున్న సినిమాల లిస్ట్ ఒక్కసారిగా బయటకి రావడంతో ఈ టర్మ్ మొత్తం పవన్ సినిమాలతోనే బిజీ గా ఉంటాడు ఇంకాఆ రాజకీయాల గురించి ఏం ఆలోచిస్తాడని పెదవివిరుస్తున్నాడు.  ఇప్పటికే వాకిలీ సాబ్ సినిమా ను పూర్తి చేసిన పవన్ ఈ సినిమా తర్వాత క్రిష్ సినిమా తో, ఆ తర్వాత హరీష్ శంకర్ సినిమా తో, ఆపైన సురేందర్ రెడ్డి సినిమా తో బిజీ గా ఉండబోతున్నాడు. ఈలోపు రాజకీయంగా ఏదైనా అమరావతి లాంటి పెద్ద అంశం చర్చకు వస్తే జనసేన తరపున పవన్ ఎలా పోరాడతాడు అని వారు వాపోతున్నారు.. ఇప్పటికే దారుణంగా ఉన్న పార్టీ ని బలోపేతం చేయాలి అంటే చాల సమయం పడుతుంది.  మొత్తం అన్ని సినిమాలు షూటింగ్ లు పూర్తి కావాలంటే దాదాపు రెండేళ్ళు సమయం పడుతుందని అలాంటప్పుడు జనసేన రాజకీయాలు జోరందుకోవాలంటే మరో రెండేళ్లు ఆగాలిసిందే అని  బాధపడుతున్నారు..

ఓ వైపు ఇప్పుడిప్పుడు పుంజుకుంటున్న బీజేపీ తో చేయి కలిపి మంచి పనే చేసినా ఇలా సినిమాలు చేసుకోవడం రేపు ఎన్నికల ప్రచారంలో చాలా ఇబ్బంది అవుతుందని భావిస్తున్నారు.. అంతేకాకుండా తమ అధినేతను పార్ట్ టైం పొలిటీషియన్ గానే ప్రజలు భావించడంతో పాటు ప్రత్యర్థి పార్టీలు ఇదే విషయాన్ని పెద్దవి చేస్తాయన్న ఆందోళన జనసైనికుల్లో కనిపిస్తుంది.పవన్ కళ్యాణ్ ఆరు సినిమాలతోనే ఆగుతారా లేక ఈ సంఖ్య మరింత పెంచుతారా అన్నది కూడా క్లారిటీ లేదని తెలుస్తుంది. 2024 ఎన్నికల ముందు వరకు సినిమాల్లో బిజీగా రాజకీయాల్లో సోషల్ మీడియా వేదికలపై చురుగ్గా ఉంటె సరిపోతుందని జనసేనాని పవన్ కళ్యాణ్ భావిస్తున్నా ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంటేనే పట్టించుకోని ప్రజలు ఇలా సోషల్ మీడియా ద్వారా ఎన్ని రోజులని గుర్తుపెట్టుకుంటారని వాపోతున్నారు.. ఏది ఏమైనా సినిమాలు చేస్తే పవన్ అందరికి బాగానే కనిపించిన రాజకీయంగా ఎదగాలంటే ఆ సినిమాని పూర్తిగా పక్కనపెట్టేయాల్సిందే అని అంటున్నారు..  వచ్చేసారి అధికారంలోకి రావడమే లక్ష్యం పనిచేస్తే కానీ జనసేనకు కొన్ని సీట్లైనా లభిస్తాయి.. ఇప్పటికే వీక్ గా ఉన్న టీడీపీ ని మరింత వీక్ చేసి తొందరలోనే ఏపీలో ప్రత్యామ్నాయంగా జనసేన ను చేయాలని జనసేనుడు కూడా ఆలోచించిన సంగతి తెలిసిందే..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -