రెండు కోట్లు విరాళం ఇచ్చిన పవన్ కళ్యాణ్

417
pawan kalyan donate one crore for pm releif fund
pawan kalyan donate one crore for pm releif fund

జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ ప్రధాని సహాయ నిధికి కోటి రూపాయలు విరాళంగా పక్రటించారు. కరోనా కట్టడికి కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో తనవంతు భాగస్వామ్యం కోసం ఈ నిధులు అందజేస్తున్నట్లు ట్విట్టర్ ద్వారా తెలిపారు.

‘ఈ కష్టకాంలో ప్రధాని మోదీకి బాసటగా నిలవాల్సిన అవసరం ఉంది. ఆయన నాయకత్వం, స్ఫూర్తిదాయక చర్యలు ఈ కష్టం నుంచి దేశాన్ని గట్టెక్కించగలవని నమ్ముతున్నా’ అంటూ ట్వీట్‌ చేశారు. అలానే కరోనా వైరస్ వ్యాపించకుండా, కట్టుదిట్టమైన చర్యలు తీసుకుని, నిత్యమూ పోరాటం చేస్తున్న తెలుగు రాష్ట్రాలకు రూ. 50 లక్షల చొప్పున ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నట్టు పవన్ తెలిపారు.

ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఆయన ఓ ట్వీట్ పెట్టారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రుల సహాయ నిధికి ఈ డబ్బులను డొనేట్ చేస్తున్నానని, కరోనా మహమ్మారి వ్యాపించకుండా ఈ డబ్బులను వెచ్చించాలని పవన్ కోరారు.

Loading...