Saturday, April 20, 2024
- Advertisement -

గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్ లో పవన్ కళ్యాణ్..?

- Advertisement -

సినిమాల్లోంచి రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తుల దాదాపు సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు.. ముఖ్యమంత్రి స్థాయి దగ్గరినుంచి మంత్రుల దాకా సినిమా వాళ్ళు రాజకీయంగా చాల అద్భుతంగా రాణించారు.. దేశవ్యాప్తంగా చూసుకుంటే సౌత్ లో సినిమా వాళ్ళు రాజకీయంగా ఎదిగారు.. ముఖ్యమంత్రి వంటి స్థాయి పదవులను అందుకుని ఆ పదవులకు వన్నె తెచ్చారు.. తమిళనాట ఎంజీఆర్, జయలలిత, తెలుగులో ఎన్టీఆర్, చిరంజీవి ఇంకా పలువురు రాజకీయాలకు సినీ స్టైల్ ని అద్ది రాజకీయాలను ఎంతో ఆసక్తికరంగా మార్చారు..

ఇక ఇప్పుడు తెలుగునాట పవన్ కళ్యాణ్ మళ్ళీ అలాంటి రాజకీయాలను చేయడానికి ఎంతో ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే రాజకీయాల్లోకి వచ్చి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినా పవన్ కళ్యాణ్ కృంగిపోకుండా ఇంకా రాజకీయాలలో కొనసాగుతుండడం విశేషం.. ప్రస్తుతం ఒంటరిగా పోరాడడం అంత మంచిది కాదని తెలిసి బీజేపీ తో పొత్తు తో రాష్ట్ర ప్రజలకోసం పోరాడుతున్నారు..

ఇక ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో తన సత్తా చాటేందుకు ముందుకు వస్తున్నారు.. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పార్టీని విజయం దిశగా నడిపేందుకు పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్ని ప్రయత్నాలూ చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ నుంచి ఒక్క రాజాసింగ్ మాత్రమే గెలిచారు. రాష్ఠ్రంలోనూ, నగరంలోనూ ఆ పార్టీకి ఎమ్మెల్యేలు లేకపోవడం లోటుగా కన్పిస్తుంది. ఎంపీలు మాత్రం నలుగున్నారు. నగరానికి చెందిన ఎంపీ కిషన్ రెడ్డి ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్నారు. ఇక నగరంలో ఎమ్మెల్యేలు లేని లోటును భర్తీ చేసుకునేందుకు బండి సంజయ్ కొత్త వ్యూహాన్ని రచించారు. ఆయనే పవన్ కళ్యాణ్.. ఇప్పటికే తమ పార్టీ తో అనుసంధానమై ఉన్నపవన్ కళ్యాణ్ ని  ప్రచారంలో  వాడుకుని విజయ తీరాలకు చేరాలని అయన ముందుకు వచ్చారు.. ఈ నేపథ్యంలో పవన్ ఇమేజ్ బీజేపీ కి ఏమాత్రం ఉపయోగపడుతుందో చూడాలి..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -