Friday, March 29, 2024
- Advertisement -

ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు ఓటమి ముందే తెలిసిపోయిందా..?

- Advertisement -

హీరోగా తిరుగులేని క్రేజ్‌, అత‌ని సినిమా విడుద‌ల అవుతుంటే చాలు బాక్సాఫీస్ షేక్ అవుతోంది. ఇక ఆ సినిమా హిట్ అయితే క‌లెక్ష‌న్ల సునామియే. ఇంత‌కి ఎవ‌రా ఆ హీరో అనుకుంటున్నారా…? ఆ స్టార్ హీరో మ‌రెవ్వ‌రో కాదు ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌. ఇంత‌టి క్రేజ్ ఉన్న ప‌వ‌న్ క‌ల్యాణ్ సినిమాల‌ను వ‌దిలేసి రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ప‌వ‌న్ క‌ల్యాణ్ 2014లోనే జ‌న‌సేన పార్టీ పెట్టిన‌ప్ప‌టికి , ఆ ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌కుండా టీడీపీ పార్టీకి మ‌ద్దుతునిచ్చి ఆ పార్టీ అధికారంలోకి రావ‌డానికి దోహ‌దం ప‌డ్డాడు.

ఆ త‌రువాత జ‌రిగిన (2019) ఎన్నిక‌ల్లో సొంతంగానే పోటీ చేశారు ప‌వ‌న్ క‌ల్యాణ్‌. జ‌న‌సేన పార్టీ త‌రుపున స్టార్ క్యాంప్‌నైర్‌గా అన్ని తానై ప్ర‌చారం నిర్వ‌హించాడు ప‌వ‌న్ క‌ల్యాణ్‌. మ‌ధ్య‌లో మెగా ఫ్యామిలీ హీరోలు ప్ర‌చారం నిర్వ‌హిస్తార‌ని టాక్ వినిపించిన‌ప్ప‌టికి అవి ఊట్టి రూమ‌ర్సే అని తేలాయి. ఎన్నిక‌ల ముందు కాస్తా హ‌డావిడి చేసినప్ప‌టికి ఎన్నిక‌ల తరువాత పూర్తిగా తెలిపోయాడు ప‌వ‌న్ క‌ల్యాణ్. ఈ ఎన్నిక‌ల్లో ప్ర‌ధానంగా వైసీపీ, టీడీపీ మ‌ధ్యే ప్ర‌ధాన పోటీ క‌నిపించింది. ప‌వ‌న్ జ‌న‌సేన ఎక్క‌డ కూడా ప్ర‌భావం చూపించ‌లేక‌పోయింది. ఇదిలా ఉంటే అస‌లు ప‌వ‌న్ ఎక్క‌డ గెలుస్తారో తెలియ‌క జ‌న‌సైనికులు సైతం జుట్టు పిక్కుంటున్నారు.

ఎన్నిక‌లు ముందు హ‌ల్ చ‌ల్ చేసిన జ‌న‌సైనికులు ఎన్నిక‌ల స‌మ‌యానికి చేతులు ఎత్తేశారు. 75 సీట్ల‌లో పోటీ చేసిన ప‌వ‌న్ క‌ల్యాణ్ సీఎం ఎలా అవుతార‌ని సామాన్య ప్ర‌జ‌లు ఆయ‌న్ని ప్ర‌శ్నిస్తున్నారు.చిరంజీవి ప్ర‌జారాజ్యం క‌న్నా ప‌వ‌న్ జ‌న‌సేన కాస్తా బెట‌ర్‌గా క‌నిపించింది. కాని ఎన్నిక‌ల స‌మ‌యానికి జ‌న‌సేన పూర్తిగా తెలిపోయింది. ఈ కార‌ణంగా ప‌వ‌న్ ఎన్నిక‌ల త‌రువాత బ‌య‌ట ఎక్క‌డ క‌నిపించ‌డం లేదు. క‌నీసం ఎన్నిక‌ల జ‌రిగిన తీరుపైనైనా కామెంట్ చేస్తాడ‌ని చాలామంది ఎదురు చూశారు. కాని ప‌వ‌న్ అది కూడా చేయ‌లేదు. ప‌వ‌న్‌కు త‌న ఓట‌మి ముందు తెలిసింద‌ని, అందుకే ఆయ‌న బ‌య‌టికి రావ‌డం లేద‌ని చ‌ర్చించుకుంటున్నారు. ఇక ప‌వ‌న్ అభిమానులు కూడా త‌మ హీరో రాజ‌కీయాలు వ‌దిలేసి మ‌ళ్లీ సినిమాల్లో న‌టిస్తు మంచిద‌ని కోరుకుంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -