Friday, April 26, 2024
- Advertisement -

పవన్ కళ్యాణ్ చేస్తుంది కరెక్టేనా ?

- Advertisement -

జనసేన నాయకుడు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ తాజాగా జనసేనకు గుడ్ బై చెప్పారు. ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. రాజీనామా లేఖలో పవన్ కళ్యాణ్ పై కాస్తా ఘాటుగానే విమర్శలు చేశారు. పవన్ రాజకీయాలకే అంకితమని చెప్పి.. ఇప్పుడు మళ్లీ సినిమాల్లో నటించడం ఏంటని..ఆయన లో నిలకడ లేదని.. అందుకే తాను రాజీనామా చేస్తున్నట్టు జేడీ పేర్కొన్నారు.

నారాయణ లేఖపై పవన్ స్పందిస్తూ మరో లేఖ విడుదల చేసారు. “లక్ష్మీ నారాయణ గారి భావాలను గౌరవిస్తున్నాము. శ్రీ వి.వి.లక్ష్మీ నారాయణ గారు భావాలను గౌరవిస్తున్నాము ఆయన రాజీనామాను ఆమోదిస్తున్నాము నాకు సిమెంట్ ఫ్యాక్టరీలు పవర్ ప్రాజెక్టులు గనులు పాల ఫ్యాక్టరీలు లాంటివి ఏవీ లేవు. అధిక వేతనం పొందే ప్రభుత్వ ఉద్యోగినీ కాను నాకు తెలిసిందల్లా సినిమా ఒక్కటే నా మీద ఆధారపడి అనేక కుటుంబాలు జీవిస్తున్నాయి. వారి కోసం నా కుటుంబం కోసం పార్టీకి ఆర్థిక పుష్టి కోసం నాకు సినిమాలు చేయడం తప్పని సరి ఇవన్నీ లక్ష్మీ నారాయణ గారు తెలుసుకొని తన రాజీనామాలో ప్రస్తావించి ఉంటే బాగుండేది. శ్రీ లక్ష్మీనారాయణ గారు పార్టీకి రాజీనామా చేసినప్పటికీ వ్యక్తిగతంగా నాకు జన సైనికులకు ఆయన పై ఉన్న గౌరవం ఎప్పటికీ అలాగే ఉంటుంది ఆయనకు శుభాభినందనలు” అని పవన్ లేఖలో పేర్కొన్నారు.

నిజానికి జేడీ ప్రస్తావించిన అంశాలు చాలా క్లియర్ గా ఉన్నాయని చెప్పాలి. పవన్ కళ్యాణ్ గతంలో రాజకీయాల్లో మాత్రమే ఉంటానని చెప్పి.. ఇప్పుడు మళ్లీ సినిమాలు చేయడం అనేది ఎంత వరకు కరెక్ట్ అనేది ఇక్కడ ప్రస్తావన వస్తోంది. చాలా మంది ఏపీ ప్రజల్లో మెదులుతున్న ప్రశ్న ఇదే. రాజకీయాల్లోనే ఉంటాను సినిమాల జోలికి పోను అని పవన్ అనలేదా? ఇప్పుడు జేడీ ఆ మాట అనేసరికి ఎందుకో ఇప్పుడు ప్రెస్ నోట్ విడుదల చేసి సంజాయిషి ఇచ్చుకుంటున్నారు పవన్ కళ్యాణ్ అని చాలా మంది సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు.

ఒకప్పుడు నోటికొచ్చిందల్లా వాగడం ఎందుకు ఇప్పుడు అంతా అయ్యిపోయాక ప్రెస్ నోట్ లు విడుదల చేసుకోడం ఎందుకు అన్నది ప్రతి ఒక్కరి ప్రశ్న. రాజకీయాలకే అంకితం అని కాకుండా సినిమాలు కూడా చేసుకుంటాను అని పవన్ కళ్యాణ్ ముందే చెప్పింటే బాగుండేది అనేది మరికొంతమంది వాదన. ఇక పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రం మా అన్న రాజకీయాల్లో లేకున్న పర్వాలేదు కానీ సినిమాలు మాత్రం చేయాలని సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -