Thursday, April 25, 2024
- Advertisement -

బాబుపేరెత్త‌కుండా దుమ్ముదులిపిన మోదీ…

- Advertisement -

బాబు పేరెత్త‌కుండా దుమ్ముదులిపారు ప్ర‌ధాని న‌రేంద్రమోదీ.మోదీ అధికారంలో ఉంటే తాము ఇష్టారాజ్యంగా నడుచుకోవడం కుదరదని ఇక్కడి నాయకులు భయపడుతున్నారంటూ విమర్శించారు. ఇక్కడున్న నేతలు యూ టర్న్ తీసుకోవడంలో గొప్పోళ్లు అని ప‌రోక్షంగా బాబుపై సెటైర్లు వేశారు. శుక్రవారం సాయంత్రం విశాఖపట్నంలోని రైల్వే గ్రౌండ్స్ లో బీజేపీ ప్రజా చైతన్య సభలో మోదీ ఎంతో ఆవేశంగా ప్రసంగించారు.

మోదీ అధికారంలో ఉంటే తాము ఇష్టారాజ్యంగా నడుచుకోవడం కుదరదని ఇక్కడి నాయకులు భయపడుతున్నారంటూ విమర్శించారు. ఇక్కడి నేతలు ఎలాంటివారితో జట్టు కడుతున్నారో ప్రజలు గమనించాలని చంద్రబాబు-రాహుల్ గాంధీల మైత్రిపై పరోక్ష విమర్శ చేశారు. ఇక్క‌డి ప్ర‌భుత్వం అవ‌నీతిలో కూరుకు పోయింద‌ని…రాష్ట్రానికి కేంద్రం ఎంత స‌హాయం చేసినా మాపైనే విషం చిమ్ముతున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. తమ అవినీతి సామ్రాజ్యాన్ని కాపాడుకునేందుకు.. రాత్రింభవళ్లు విమర్శలు చేస్తూ కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. ప్రజల పిల్లలను ముందుకు తీసుకెళ్లాల్సిన వారు.. సొంత పిల్లలను ముందుకు తీసుకెళ్లడం మీద దృష్టిపెట్టారని ప్రధాని మోదీ పరోక్షంగా చంద్రబాబు మీద విమర్శలు చేశారు.

త‌న‌కు ఎలాంటి భ‌యం లేద‌ని… రాష్ట్రంలో వారి కుటుంబ పాలనను ఏర్పాటు చేయాలనుకుంటున్నారని మండిపడ్డారు. ఫైళ్లు తెరుస్తారని కొందరు భయపడుతున్నారని మోదీ విమర్శించారు. దేశం మొత్తం పాక్‌ని దోషిగా చూపిస్తుంటే ..మహాకూటమి నేతలు మాత్రం సైన్యం మనో ధైర్యం దెబ్బతినేలా మాట్లాడుతున్నాయని మోదీ మండిపడ్డారు.

ఉత్త‌రాంధ్ర అభివృద్దికి కేంద్రం క‌ట్టుబ‌డి ఉంద‌న్నారు. విశాఖ కేంద్రంగా రైల్వేజోన్‌ను ఏర్పాటు చేసి ఉత్త‌రాంధ్ర ప్ర‌జ‌ల చిర‌కాల కోరిక‌ను నెర‌వేర్చామ‌న్నారు.గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేసినా.. విశాఖ, ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలమైన జోన్‌ను అందించాలన్న ఆకాంక్షతో కీలక నిర్ణయం తీసుకున్నాం. జోన్ ద్వారా ఉద్యోగ‌క‌ల్ప‌న జ‌ర‌గుతుంద‌న్నారు. అంత‌కు ముందు మోదీ తెలుగులో మాట్లాడి అంద‌ర్నీ ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -