Saturday, April 20, 2024
- Advertisement -

అడ్డంగా దొరికేశారు….. బాబు, పవన్‌ల చీకటి బంధానికి తిరుగులేని సాక్ష్యం

- Advertisement -

చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు ఒకరినొకరు విమర్శించుకుంటూ చేస్తున్న రాజకీయం మొత్తం నాటకమేనా? వీళ్ళిద్దరి రాజకీయంపై సీమాంధ్రుల్లో ఇప్పటికే ఉన్న ఎన్నో అనుమానాలు నిఖార్సైన నిజాలే అని నిరూపించే తిరుగులేని సాక్ష్యం ఇప్పుడు బయటపడిపోయింది. చంద్రబాబు నివాసం ఉంటున్న కరకట అక్రమ నివాసానికి, జనసేన పార్టీ ఆఫీసుకు స్పాన్సరర్ ఒకరే అన్న విషయం అందరికీ తెలిసిందే. ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ కోసం ఏకంగా మూడున్నర కోట్లు ప్రజాధనాన్ని అప్పనంగా ఖర్చుపెట్టడానికి రెడీ అయిపోయాడు.

ప్రతిపక్ష నేత, కేబినెట్ ర్యాంక్ హోదా కలిగిన వైఎస్ జగన్‌కి కనీసం క్వార్టర్స్ కేటాయించడానికి కూడా చంద్రబాబుకు మనసు రాదు. కానీ ఏ హోదా లేని పవన్ కళ్యాణ్ కోసం స్పెషల్ ఫ్లైట్స్, హెలికాప్టర్స్ ప్రభుత్వ ఖర్చుతో ఏర్పాటు చేయించగలడు. ఇప్పుడు కూడా మరోసారి పవర్ స్టార్‌‌గారి సౌకర్యం కోసం ఏకంగా మూడున్నర కోట్లు ప్రజాధనాన్ని ఖర్చుపెట్టడానికి రెడీ అయ్యాడు చంద్రబాబు. అది కూడా జనసేన పార్టీ ఆఫీస్ నుంచి పవన్ ఖరీదైన కార్లు తిరగడానికి అవసరమైన రిచ్ రోడ్ కోసం అట. ఈ విషయాన్ని స్వయంగా జీవోలో కూడా ప్రస్తావించడం విశ్లేషకులను కూడా విస్తుగొలుపుతోంది. మరీ ఇంత అడ్డగోలుగా ప్రజాధనాన్ని ఖర్చుచేస్తారా? ఎంత చంద్రబాబుకు మద్దతు ఇస్తూ ఉంటే మాత్రం కేవలం పవన్ కళ్యాణ్ ఖరీదైన కార్ల సౌకర్యం కోసం మూడున్నర కోట్లతో రోడ్డు వేయించడానికి బాబు ప్రభుత్వం సిద్ధపడడం రాజుల కాలం నాటి తత్వాలను గుర్తుచేస్తుందనడంలో సందేహం లేదు. తెరవెనుక ప్యాకేజీలు, రాజకీయ కుమ్మక్కులు, కుట్రలతో ఒకళ్ళకొకళ్ళు సపోర్ట్ చేసుకుంటూ తెరముందు మాత్రం సినిమాలను మించిన రివేంజ్ డ్రామా అన్న రేంజ్‌లో యాక్ట్ చేస్తూ ఉండడం ఎవరిని మోసం చేయడానికి? ప్రజలను అంత వెర్రివాళ్ళను చేసి అధికారం పంచుకోవాల్సిన అగత్యం ఏంటి అని సోషల్ మీడియాలో పవన్-చంద్రబాబు బంధం గురించి తీవ్రస్థాయిలో విమర్శలు వినిపిస్తున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -