Friday, April 19, 2024
- Advertisement -

చంద్రబాబు చెత్త వ్యూహాలు……. దేశంలో తెలుగువారి పరువుకు ఎసరు

- Advertisement -

ఆయనే డబ్బా కొట్టుకున్నట్టుగా కచ్చితంగా దేశంలో ఉన్న సీనియర్ నాయకుల్లో ఒకడు. అయితే ఏంటి? కేవలం వయసు రీత్యానే ఆ అనుభవం తప్ప చేసే పనులు, మాట్లాడే మాటల్లో ఎక్కడైనా ఆ మెచ్యూరిటీ కనిపిస్తోందా? బాబు అనుభవమంత వయసులేని వైఎస్ జగన్ చూపించే పరిణతిలో పది శాతం అయినా చంద్రబాబులో కనిపిస్తోందా? కొన్ని నెలలుగా జాతి మీడియా సర్వేలు, ఫేక్ సర్వేల్లో తప్ప చంద్రబాబు గెలిచే అవకాశం ఉంది అని చెప్పిన ఒక్క సర్వే అయినా ఉందా? జాతీయ మీడియా అంతా కూడా జగన్‌కే పట్టం కట్టింది. చంద్రబాబు ఓడిపోతాడని ఎన్నికలకు ముందే అందరికీ అర్థమైంది. చంద్రబాబుకు కూడా అర్థమైంది. తన పాలన ప్రజలకు నచ్చలేదని స్పష్టంగా ఆయనకు తెలిసిపోయింది. అందుకే ఎన్నికల ప్రచారంలో తన పాలన చూసి ఓటేయమనకుండా జగన్ వస్తే ఏదో జరిపోతుందని ప్రజలను భయపెట్టాలని చూశాడు. ఇక కేసీఆర్, మోడీలతో జగన్ కుమ్మక్కయ్యాడని సెంటిమెంట్ రెచ్చగొట్టడానికి ట్రై చేశాడు. తెలంగాణా ప్రజలతో సీమాంధ్ర ప్రజలు గొడవలు పడాలన్న కక్కుర్తి చంద్రబాబు వ్యూహాల్లో కనిపించింది. కానీ కేవలం ముఖ్యమంత్రిగా చాలా తక్కువ అనుభవమున్న కేసీఆర్ మాత్రం ఎక్కడా కూడా సంయమనం కోల్పోలేదు. దాంతో బాబు అసహనం ఇంకా పెరిగింది.

ఇక నిన్న జరిగిన ఎన్నికల్లో చంద్రబాబుపై కసితో ప్రజలు ఓట్లేశారు అన్న మాట నిజం. అధికార పార్టీని గెలిపించడానికి ప్రపంచంలో ఎక్కడా కూడా ప్రజలు పోటెత్తడం ఉండదు. ఎందుకంటే ఏ ప్రభుత్వం కూడా ప్రజల మెప్పును ఆ స్థాయిలో పొందలేదు. చాలా అరుదుగానే అలా జరిగింది. తెలంగాణాలో ఓటింగ్ శాతం తగ్గడానికి కారణం అక్కడ ప్రజలకు సరైన ప్రత్యామ్నాయం లేకపోవడమే. అదే ఆంధ్రప్రదేశ్‌కి వచ్చేసరికి ఐదేళ్ళు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్ మాటల్లో నిలకడతనం, ఎవరు ఎంత రెచ్చగొట్టినా జగన్ పాటించిన సంయమనం, పాదయాత్రతో సహా ఐదేళ్ళపాటు పూర్తిగా ప్రజల మధ్యనే, ప్రజల కోసం ఉండడం లాంటి కారణాలతో జగన్‌ పట్ల ప్రజలకు అభిమానం ఏర్పడింది. అదే టైంలో చంద్రబాబుపై పూర్తి వ్యతిరేకత వచ్చింది. మాట తప్పడం, హామీలు నెరవేర్చకపోవడం, అబద్ధాలు, మోసాలు, ఎన్నికల ఏడాదిలో మోడీతో రాజకీయం కోసం గొడవలు పెట్టుకోవడంలాంటి ఎన్నో కారణాలు దానికి కారణమయ్యాయి. ఈ విషయాలన్నీ చంద్రబాబుకు తెలుసు. ఓటమి అర్థమైపోయింది కాబట్టే ఇప్పుడు రచ్చ చేస్తున్నాడు. ఇవే విషయాలపై జాతీయ మీడియాలో చర్చలు పెట్టి చంద్రబాబుని థర్డ్ గ్రేడ్ పొలిటీషియన్‌గా వర్ణిస్తున్నారు. ఆ రకంగా మొత్తంగా తెలుగు ప్రజలు, తెలుగు రాజకీయాలు అంటేనే తక్కువ స్థాయి అభిప్రాయం వచ్చేలా బాబు చేస్తున్నాడన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

ఇప్పుడు ఎన్నికలు వరస్ట్‌గా జరిగాయని అంటున్న బాబు రేపు అధికారంలోకి వస్తే ఏం చెప్తాడు? ఒక వేళ అధికారంలోకి రాకపోయినా కుప్పంలో గెలుస్తాడు కదా………అప్పుడు ఏం చెప్తాడు? ఏం చెప్పినా సమర్థించే, భజన చేసే ఎల్లో మీడియా ఉంది కదా అని రెచ్చిపోతూ బాబు చేస్తున్న రాజకీయం తటస్థులు, ఆలోచనాపరులు, మేధావుల్లో బాబుపైన ఉన్న కాస్త అభిమానం కూడా పూర్తిగా పోయేలా చేస్తోందన్న అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి. ప్రచారం ముగిసినప్పటి నుంచీ అనధికార ప్రచారం కోసం బాబు పడ్డ తాపత్రయం, జగన్ హుందాతనం అందరికీ అర్థమవుతూనే ఉంది. కాస్త జగన్‌ని చూసైనా నేర్చుకో బాబూ అని ఇప్పుడు నెటిజనులు చంద్రబాబుకు సలహా ఇస్తున్నారంటే అంతా కూడా చంద్రబాబు స్వయంకృతాపరాథం, ఆయనను గైడ్ చేస్తున్న ఎల్లో మీడియా అధినేతల తెలివితక్కువతనం అని చెప్పడానికి సందేహించక్కర్లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -