పవన్-బీజేపీ కలిసినా ఏం చేయాలేరు.. జగన్ దే ఎప్పుడైన గెలుపు : పోసాని

497
Posani Krishna Murali Shocking Comments On Ys Jagan
Posani Krishna Murali Shocking Comments On Ys Jagan

చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా.. లేకుంటే పవన్, బీజేపీ కలిసినా.. లేకుంటే పవన్ బీజేపీతో చంద్రబాబు కలిసి ఎన్ని కుట్రలు చేసినా సరే జగనే గెలుస్తాడని నటుడు పోసాని కృష్ణమురళి అన్నారు. ఏపీ రాజకీయాల్లో పవన్ మంచి లీడర్ గా పేరు తెచ్చుకున్న ఆయనను జనం నమ్మరని పరోక్షంగా కామెంట్స్ చేశారు.

ఏపీలో ఎంతటి మహామహులు వచ్చినా జగన్ ఉన్నంత వరకు ఆయనదే గెలుపు అని అన్నారు. మంచి వ్యక్తిని.. ప్రజలతో నిలబడేవారినే.. ప్రజలు గెలిపిస్తారని.. అల్లాటప్పాగా రాజకీయాలు చేసేవారిని గెలిపించరని అన్నారు. ఎంతమంది లీడర్స్ ఉన్న.. ప్రజలకు ఉపయోగపడేవారే గెలుస్తారని అన్నారు. గడిచిన హయంలో చంద్రబాబు ఎన్ని కోట్లు వృథా చేసినా.. పోలవరం కట్టకపోయినా.. ప్రజాధనం లూటీ చేసినా కూడా ఈ కోర్టులు వ్యవస్థలు ఏమీ చేయలేదని.. అసలు బాబును ఎవరూ ఏమీ చేయలేరని పోసాని వ్యాఖ్యానించారు. రోడ్డున వెళ్లేవారు కూడా జగన్ సర్కార్ పై కోర్టులకు వెళుతున్నారని.. తాను కూడా ఏం మాట్లాడిన కోర్టులకు వెళుతారనే తాను వ్యాఖ్యానించడం లేదని పోసాని చెప్పుకొచ్చాడు.

నాకు లీగల్ తెలియదని.. అంత శక్తి లేదని.. కానీ మోరల్ ఉందంటూ చెప్పుకొచ్చాడు. జగన్ ప్రభుత్వంలో ఎలాంటి పదవులు తీసుకోనని పోసాని స్పష్టం చేశారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక నా ఇంటికి మనుషులను పంపించి.. ఏ పదవి కావాలో తెలుసుకోవాలని పంపించారని.. కానీ తనకు ఏ పదవి వద్దని జగన్ కు చెప్పానని పోసాని చెప్పుకొచ్చారు.

ఆగస్టు 16న రాజధాని శంకుస్థాపన ?

చంద్రబాబు ప్రెస్ మీట్ అంటే భయపడుతున్న టీడీపీ నేతలు..?

వైసీపీలో చేరుతా.. కానీ ఆ పని చేయాలి : జేసీ సంచలన వ్యాఖ్యలు

చంద్రబాబుకు జలక్ ఇస్తున్న తెలుగు తమ్ముళ్లు..!

Loading...