Saturday, April 20, 2024
- Advertisement -

సీఎం జగన్ పై పూరి జగన్నాధ్ ప్రశంసలు..!

- Advertisement -

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ప్రశంసల జల్లు కురిపించారు. సీఎం జగన్ చేసిన పనికి ఈ టాలీవుడ్ డ్యాషింగ్ డైరెక్టర్ ట్విట్టర్ లో హాట్ కామెంట్స్ చేశారు. తాజాగా అత్యాధినిక టెక్నాలిజీతో ఉన్న 104, 108 అంబులెన్స్ లను దాదాపుగా 1088 అంబులెన్స్ లను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించారు.

ఈ విషయంపై సీఎం జగన్ పని తీరు అద్భుతం అని దర్శకుడు పూరి కొనియాడారు. ప్రపంచమంతా కరోనాతో పోరాడుతున్న వేళ ప్రజల కోసం ఇటువంటి కార్యక్రమాలు అమలు చేస్తున్న జగన్ సంక్షేమం పట్ల చూపిస్తున్న శ్రద్ధకు ధన్యవాదాలు సార్ అంటూ పూరి జగన్నాథ్ కొనియాడారు. గ్రామాలు పట్టణాలు నగరాల్లో వైద్యం వీటితో మెరుగవుతుందని పూరి ప్రశంసించారు.

ఇక ఇదే విషయంపై టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ థమన్ స్పందించారు. ఒకే రోజు 1088 అంబులెన్స్ సర్వీసు వాహనాలను ప్రారంభించడం పై హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ తీరును అభినందిస్తూ ట్వీట్ చేశారు. ఇలా సీఎం జగన్ పై ప్రముఖ జర్నలిస్టులు కేంద్ర మంత్రులు సినీ రాజకీయ ప్రముఖుల నుంచి 104 అంబులెన్స్ ల అమలుపై ప్రశంసలు కురుస్తున్నాయి.

ఢిల్లీలో రఘురామకు ఊహించని షాక్.. చక్రం తిప్పిన జగన్..!

తెలంగాణ హోంమంత్రికి కరోనా పాజిటివ్..!

విశాఖ నుంచే పరిపాలన.. జగన్ ఫిక్స్..!

ఎందుకయ్యా చిట్టినాయుడూ.. గొడవలోకి మీ ఆవిడను లాగుతావ్ : విజయ సాయి

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -